దైవం దయామయుడే…?:- కవి రత్న -సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్లపల్లి-\అత్తాపూర్ హైదరాబాద్.
దొంగలైనా దొరలైనా
గుడిమెట్లు ఎక్కుతారు...
గర్భగుడిలో దర్శించి
దైవాన్ని భక్తితో మొక్కుతారు..!

కానీ...గుడిని గాయపరచే...
గుడిలో లింగాన్ని దొచుకునే...
హుండీని ఖాళీచేసే‌...దొరల వేషంలో
దోపిడీ పులులున్నాయి...జాగ్రత్త…!

గుడి బయట
ఆకలితో వణికే చేతుల్లోని
చిల్లరతో నిండిన పాత్రల్ని సైతం 
దోచుకునే దొంగలున్నారు జాగ్రత్త…!

అక్కడ న్యాయదేవత 
కళ్ళు మూసుకుందంటూ...
ఇక్కడ గుడిలోని దైవం గుడ్డివాడంటూ..!

దొంగలే దొరలై...దొరలే దొంగలై 
సమాజవీధుల్లో రాక్షసులై... 
అహంకారంతో...విర్రవీగుతున్నారు..!
సింహాలై....వీరవిహారం చేస్తున్నారు..! 

అయ్యో…
ఓ న్యాయదేవతా…
అయ్యో ఓ శంకరా…
ఈ దుర్మార్గులపై...ఈ దుష్టశక్తులపై  
ఇంకా దయ ఏల..? దాక్షిణ్య మేల..?
ఇంకా కరుణ ఏలా..? కనికరమేల...?

ఈ సభ్య సమాజాన్ని జలగల్లా 
పట్టిపీడించే ఈ చీడపురుగుల్ని
ఏరి పారెయ్యరేమి..? రెక్కలు విరిచి 
వారిని శిక్షించరేమి..? చితిని పేర్చరేమి..?
మా ఈ ఆవేదన ఆక్రందన ఆలకించరేమి.?


కామెంట్‌లు