***
"వీడి వైజ్గం పాడు గాను. సైమానికి పెద్ద దవాఖానాకి తోల్కపోబట్టి తల్లి బిడ్డ బత్కి బట్ట గట్టిండ్రు. జెర్రైతే అన్నేలం జరిగేది.
ఆకాడ్కి "ఏదో తేడాగుంది. గిక్కడ అయ్యేపనిగాదు దవాఖానాకి తోల్క పోవాలె అని గా ఆరెంపి డాటరింట్ల పన్జేసే ముసలవ్వ శెప్తనే ఉందట. కాన్పు నేన్జేత్త నువ్వాగని గింత కాడికి తెచ్చిండు.
గా ముసలవ్వ సద్వకపొయినా మున్పు మంత్రసానితనం జేసిందాయె.గందుకనే పొట్టతోనున్నోళ్ళ కడ్పు తడిమి తేలిక్కాన్పా? కట్టవా అనేది ?సూశి సూడంగనే శెప్తది.గస్మంటి అవ్వ మాటల్ని శెవిన బెట్టకుండ గింత కాడికి తెచ్చిండు. గియ్యాల ఎంత ఘోరం సూశేటోల్లమో!ఉత్త పున్నేనికి ఇద్దరి పానాలు తీసేటోడవ్వా!
పొద్దుగాల లేశిన కానించి మొక్కిన దేవుళ్ళకి మొక్కకుండ కోటి దేవుళ్ళని మొక్కుతున్న.ఏడాది తిర్గక మున్పే కొండకి బొయ్యి పుట్టిన బిడ్డ జుట్టు ఇత్తనని సుత మొక్కినవ్వా! గట్లనుకున్నంకనే మన్సు నిమ్మలమైంది.
"గట్లనా శెల్లె! గిదంత ఎప్పుడైంది?ఎవడా తలకి మాసిన డాటరు?నాకు తెల్వకనే పాయె!"
నిన్న రాతిరి మా పక్కింటి కిషనన్న బిడ్డకి నొప్పులొచ్చినయ్ అవ్వా! ఎంటనే గీ నడ్మనే ఊళ్లెకి కొత్తగొచ్చిన ఆరెంపి డాటరింటికి పొల్లని తోల్కబోయిండ్రు. గక్కడ మన శిన్నప్పటి మంత్రసాని మల్లవ్వ పన్జేత్తుందిలే. గా అవ్వ పొల్లని పట్కొని జూసి బిడ్డ కడ్పుల అడ్డం తిర్గింది.కాన్పు తేలిగ్గాదని శెప్తనే ఉందట.గా డాటరేమో ఇంజీశనిత్తె నొప్పులు పెరిగి కాన్పయితది. సద్వుకున్న నాకు దెల్సా? నీకు దెల్సా అని గద్మాయించి ఇంజీషన్ ఇచ్చిండంట. గా పొల్ల కాన్పు తీయక,నొప్పులకు తట్కోక గిల్ల గిల్ల కొట్కుంటుంటే మల్లవ్వ డాటరు మీద మల్లెవడిందట.
కిషనన్న సర్రసర్ర పట్వారీ ఇంటి కానించి కారు దెప్పించి పెద్ద దావఖానకి తోల్కపోవుడు. గబ్బగబ్బ డాటర్లు ఆప్రీశను జెయ్యబట్టి తల్లీపిల్ల దక్కిండ్రు.గండం గట్టెక్కింది.
లేకుంటెనా? తల్సుకుంటెనే వొల్లు ముల్లొత్తున్నది. గా ఆరెంపి డాటరు ఈపు సాపు జేసేతందుకు గుత్ప కట్టెలు బట్కొని ఎల్తుంటే మల్లవ్వే గాన్ని తప్పిచ్చి పొలిమెర దాటిచ్చింది. గియ్యాల గా అవ్వ లేకుంటే మూడు శాల్తీలు లేశేయవ్వా!"
అంటున్న మాటల్కి అవ్వ గుండెల మీద శెయ్యేస్కుని"నిజమే శెల్లె! నువ్ శెప్పింది యింటుంటెనే సల్లజెమటలు బట్టినయ్. "అసలు రానోడికంటె అరకొరొచ్చినోడు మా పెమాదం" అంటే గిదే మరి.అసలు సద్వు రాకున్నా మల్లవ్వ ఉండబట్టి సర్పోయింది. లేకుంటే గా అరకొరొచ్చినోడు ఎంత పెమాదమో తెల్సింది.గందుకే మన పెద్దోళ్ళు గిట్ల సుత అంటుంటారు." కొత్త డాకటరు కంటే పాత రోగినే శానా నయమని"
అవ్వ మాటల్కి" నిజం అవ్వా! గియ్యాల గది సుబూది అయ్యింది.ఎంత ఆపదొచ్చినా పెద్ద డాకటర్లున్న పెద్దాసుపత్రికి బోవాలె.ఎన్కటంటే శెల్లిందేమో గని గిప్పుడవన్నీ శెల్లవు.దవాఖానకి తప్పకుండ ఎల్లాలె.వైజ్గం గక్కడే మంచిగ దొరుకుద్ది." కదవ్వ! అన్కుంట వొరమ్మ అక్కన్నించి కదిలింది.
గదండీ సంగతి!" అసలు రానోడికంటె అరకొరొచ్చినోడు మహా ప్రమాదం " అంటే గిదే. గీ వైజ్గమొక్కటే గాదు,చేసుట్ల,పెట్టుట్ల,వండుట్ల ....గిట్ల ఎన్నిట్లయినా గిదే వర్తిస్తది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి