సాహితీ కెరటాలు
===============
సమాజహితమే సాహిత్యం
లలితలావణ్యరూప సమన్వితం
అలతి పదాలు కూర్పుల సంగమం
సూక్ష్మ ప్రక్రియల సమ్మిళితం
నానీలు హైకూలూ రెక్కలు సున్నీతాలు
పంచపదులు సప్తపదులు అష్టపదులు
అష్టాక్షరీ అక్షరక్రీడ అష్టాక్షరీ గీతికలు
రూపాలెన్నైనా భావపరంపరలు
ప్రతిభా పాటవాలప్రదర్శనలు
భాషలెన్నైనా భావనా తరంగాలు
విభిన్న రకాల రచనా విధానాలు
విశేషమైన కృషి పట్టుదలతోనే సాధ్యాలు
పండిత పామరులను గుర్తింపు పొందే కళలు
చిత్ర కవితలు చిత్రాతి చిత్రమైన రచనలు
అనల్పార్ధరచనల అవకాశాలు
అతీతమైన భావనలకు బీజాలు
ఇజాల నిజాలను వెలికితీసే ప్రయోగాలు
భావజాలాలేవైనా భావనలు సహజాతాలు
రచనా వ్యాసంగాలు నవరసభరితాలు
సాహితీ సమూహాలకు చక్కని సంపదలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి