విహారయాత్రలు చేసేటప్పుడు పాటింటాల్సినవి చెబుతున్నారు తెలుగు ఉపాధ్యాయులు వేంకటేశ్వర్లు గారు. ఖచ్చింతంగా ఒక డైరీ వెంట తీసుకు వెళ్ళాలి, అక్కడ చూసిన విశేషాలను సవివరంగా రాసుకోవాలని చెప్పారు ఉపాధ్యాయులు. ఆ తర్వాత విహారయాత్రకు వెళ్ళి వచ్చారు విద్యార్థులు.
"మాస్టారూ! నేను అడిగిన ప్రశ్నకు ఇంత వివరంగా సమాధానం రాసినా మార్కులు వేయలేదు. పైగా కొట్టివేశారు. ఇది అన్యాయం కదా! నాకు పోటీదారును మొదటి ర్యాంకు సాధించేలా చేసినారు. ఇది అన్యాయం కదా! దీనికి మార్కులు వేయాల్సిందే!" అని ఆవేశంగా వచ్చింది శిల్ప. అప్పుడు వేంకటేశ్వర్లు ఇలా అన్నారు. "ఈ మధ్యనే కదా! మనం విహారయాత్రకు వెళ్ళి వచ్చాము. ఏమేం చూస్తున్నావో డైరీ రాయమన్నా కదా! నువ్వు రాసింది తీసుకురా!" అని. "నేను డైరీ రాసుకోలేదు మాస్టర్!" అన్నది శిల్ప. "ఆమెకు డైరీ రాసుకునేంత తీరిక ఎక్కడ ఉంది. వెంట తెచ్చుకున్న సెల్ ఫోనుతో ఆయా ప్రాంతాల్లో ఫ్రెండ్సుతో ఫోటోలు దిగడానికే సమయం కేటాయించింది." అని ఫక్కున నవ్వింది శిల్ప పోటీదారు లయ. శిల్ప ఏమీ మాట్లాడలేదు.
వేంకటేశ్వర్లు ఇలా అన్నారు. "నువ్వు స్టడీ మెటీరియల్లో ఉంది రాసినావు. నువ్వు విహారయాత్రకు రాకపోతే నువ్వు రాసిన దానికైనా మార్కులు పడేవి. విహారయాత్రలో చూసినవి సవివరంగా డైరీలో రాసుకోవడం మంచి అలవాటు." అని పనిగట్టుకోని మరీ చెప్పాను. డైరీ రాయలేదు. కనీసం పరీక్షలో అయినా నువ్వు చూసినవి రాయవచ్చు కదా! పరీక్షలో ఆ ప్రశ్న అడిగిన ఉద్దేశం కూడా అదే! విహారయాత్రకు వెళ్ళేది అక్కడ ఫోటోలు దిగడానికి, వెంట తెచ్చుకున్న ఉబ్బులతో అక్కడ కొనుక్కు తినడానికీ కాదు." అన్నారు మాస్టర్. శిల్ప ఏమీ మాట్లాడలేదు. "బాగా చెప్పారు గురువు గారూ!" అన్నది శ్రుతి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి