సంసార లక్ష్యం సంతానం.సౌఖ్యాలు ఎన్ని ఉన్నా, చిన్ని పాపలు లేని ఇంట్లో ఆనందం సున్నా.సవిత్రి (అమ్మ) కాలేనిస్త్రీకి,సంతోషాలుశూన్యంసంతానం కలిగినంత మాత్రాన సంతోషాలు సాగరంలా ఉప్పొంగవుఅందుకే నేర్పించండి పిల్లలకు నీతికి, అవినీతికి ఉన్నతేడా.సూక్తులు,అవి సమస్యలకు పరిష్కారం చూపే దిక్సూచులు.విద్య అనే పదంతోప్రారంభించి విద్యావిహీనః పశు:అని ముగించాడు తనశ్లోకాన్ని భర్తృహరి.విద్యకత్తి.దానికిరెండు పక్కల పదునే.లౌకిక విద్య, పారమార్ధక విద్యలవి. ఆ రెండూ ఉంటేనే పూర్ణత్వంఅదే భర్తృహరి మాటలో పరమార్థం.అక్షరవిద్య అన్నం పెడితే, అంతస్తులు మీ సొంతం చేస్తే,పారమార్థిక విద్య మానవత్వాన్ని మేల్కొల్పుతుంది.కుక్షి నింపుకోవడానికి నేర్పండి, అక్షర విద్య. కానీవారు కష్టంలోకాలు నిలదొక్కుకొనేశక్తిని ప్రసాదించే దేవుని క్రీగంటి చూపులేసూక్తులు,సందేశాలు,శతకాలు.కావ్యాలు.వాటిని నేర్పితే ఆ అక్షర బిక్షే వారికి రక్ష.మాతృభాషసూక్తిసుధ పిల్లలకు నేర్పండి సెల్లులలో.అమ్మ భాష, నేర్పే బడి, "అమ్మ ఒడి"జ్ఞప్తికి తెచ్చుకోండి శివాజీనీ.ప్రభుత్వాలు, బడులు తర్వాతఅలా చేస్తేభర్తృహరి, వేమన, సుమతి లాంటివారునమస్కరిస్తారు తెలుగు తల్లులకు, తమశ్రమ వృధాకానందుకుసంతోషిస్తారు.
అమ్మఒడే బడి.:- డా.సి.వసుంధర,చెన్నై
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి