తిరుపత్తూరు జిల్లాలోని ఆంబూరు పెరియ ఆంజనేయర్ ఆలయం శని దోషాన్ని తొలగించే నివారణా క్షేత్రం.
ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం దాదాపు 11 అడుగుల ఎత్తుగల స్వయంభువు.
విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు 1489లో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని ఆలయ శాసనం చెబుతోంది.
ఆంబూరు పెరియ ఆంజనేయర్ ఆలయ చరిత్ర పుటలు తిరగేస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.
సీతను చెర పట్టిన రావణుడితో రాముడు, అతని సోదరుడు లక్ష్మణుడు లంకలో యుద్ధం చేస్తారు. ఈ భీకర పోరులో లక్ష్మణుడు స్పృహతప్పి పడిపోతాడు.
లక్ష్మణుడి అపస్మారక స్థితిని తొలగించడానికి జాంబవంతుడి సలహా మేరకు, ఆంజనేయుడు హిమాలయాల నుండి సంజీవిని తీసుకురావడానికి బయలుదేరాడు. అరుదైన సంజీవినీ మూలికతోవస్తున్న
ఆంజనేయుడిని బంధించమని రావణుడి వంశ గురువైన శుక్రాచార్యుడు రావణుడికి సూచిస్తాడు.
తొమ్మిది గ్రహాలను సోపానాలుగా చేసుకున్న సింహాసనంపై ఆసీనుడై పాలించే రావణుడు, శని దేవుడిని పిలిచి, "సంజీవిని పర్వతంతో లంక వైపు వస్తున్న ఆంజనేయుడిని ఆపమని" ఆదేశించాడు.
కానీ ఆంజనేయుడు శని దేవుడిని చుట్టుముట్టి తన చేతిలోని సంజీవిని శని శిరస్సుపై ఉంచాడు.
శని దేవుడు సంజీవిని పర్వతం బరువును మోయలేక ఇబ్బందిపడతాడు. తనను క్షమించమని ఆంజనేయుడిని వేడుకుంటాడు.
అంతట ఆంజనేయుడు శనిదేవుడితో "నిన్ను నేను క్షమించాలంటే, ఒక షరతు ఉంది. అదేంటంటే నన్ను సందర్శించి పూజించి శ్రీరామ నామాన్ని జపించే ఏ భక్తుడికీ నువ్వు హాని చేయకూడదు. దీనికి నువ్వు అంగీకరిస్తే, నేను నిన్ను క్షమిస్తాడు" అని అంటాడు.
శనీశ్వరుడు కూడా ఆంజనేయుడి షరతుకు అంగీకరిస్తాడు. అనంతరం, ఆంజనేయర్ శనీశ్వరుడిని విడిచిపెడతాడు.
ఆంబూరులోని పెరియ ఆంజనేయర్ ఆలయం పవిత్ర క్షేత్రమని ఈ ఆలయ చరిత్ర చెబుతోంది. ఇక్కడ శనీశ్వరుడిని తన పాదాలతో తొక్కి అతని అహంకారాన్ని అణచివేసే ఆంజనేయ విగ్రహాన్ని దర్శించవచ్చు ను.
హిందూ మత ధార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయనిర్వహణ కొనసాగుతోంది. ఆంజనేయుడు తన పాదాలతో శనీశ్వరుడిని తొక్కిన విగ్రహం ఇక్కడ మాత్రమే ఉంది.
ఆయన కుడి పాదం నేల నుండి కొద్దిగా పైకి లేచి ఉంటుంది. శని ఆంజనేయుడి ఎడమ పాదం కింద ఉంటాడు. శని ముఖం ఎవరినీ చూడకుండా నేల వైపు ఉంటుంది. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి, తమిళ మాసమైన పురటాసి నెలలో శనివారాలు, చిత్రా పౌర్ణమి వంటి రోజులలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సాధారణ రోజులలో ఆలయాన్ని ఉదయం ఆరున్నర గంటలకు తెరుస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పూజలు జరుగుతాయి. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు ఆలయం తెరుస్తారు. రాత్రి 8 గంటల వరకు పూజలు జరుగుతాయి. శనివారా లలో, ఆలయం ఉదయం 5.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4.30 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం ఆంబూర్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ నుండి కిలోమీటర్ దూరంలో ఉంది.
తమిళనాడులోని దేవాలయాలలో, ప్రవేశ ద్వారం వద్ద ఒక గోపురం ఉంటుంది. కానీ ఆంబూర్ పెరియ ఆంజనేయర్ ఆలయంలో, గోపురం 5 కలశాలతో ఉంటుంది. ఇది ఈ ఆలయం ప్రత్యేకత. వెల్లూరు నుంచి 23 కిలోమీ దూరంలో ఆంబూర్ పట్టణాన్ని పూర్వం అమైయూర్ అని పిలిచేవారు. ఇప్పుడు దీనిని ఆంబూర్ అని పిలుస్తున్నారు. ఈ ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనది.
ఆలయ గర్భగుడిలో ఆంజనేయుడు పదకొండు అడుగుల పొడవైన, నల్ల రాతి విగ్రహం దక్షిణం వైపు ముఖంగా చిత్రీకరించారు. ముఖం తూర్పు ముఖంగా ఉంటుంది.
ఆంజనేయుడి తోక తలపైకి లేపి, కొన వంగి, దానికి కట్టిన గంట ఆకారంలో ఉంటుంది. ఆంజనేయుడి ఎడమ చేతిలో సౌగంధిక పువ్వుని చూడవచ్చును. చెవిన కుండలాలు ఉంటాయి. ఆంబూరు ప్రాంత ప్రజలే కాకుండా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల ప్రజలు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఆదివారాల్లో రాహుకాలంలో దీపం వెలిగించి పూజిస్తే కోరికలు నెరవేరుతాయని ఆస్తికులు నమ్మిక. శని దోషం ఉన్నవారు, శని దుష్ప్రభావాలను అనుభవిస్తున్న వారు ఈ ప్రదేశానికి వచ్చి పెరియ ఆంజనేయుడిని పూజిస్తే, శని దేవుడు కలిగించే కష్టాల నుండి బయటపడవచ్చును. అదే విధంగా, వివాహం, సంతానాన్ని ప్రసాదించే దేవతగానూ ఆంజనేయుడిని పూజిస్తారు.




addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి