శ్రమ శక్తి...విజ్ఞానం విలువ...:- కవి రత్న -సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్
కష్టం విలువనెరిగిన...
ఒక కష్టజీవి... 
ఒక శ్రమజీవి... 
ఒక కర్షకుడు...
రక్తాన్ని స్వేదంగా చిందిస్తూ...
కన్నీళ్లతో కడుపు నింపుకుంటూ... 
ఎడారిని పూలవనంగా మార్చేస్తాడు...

ఒక తిండిపోతు... 
ఒక తిరుగుబోతు... 
ఒక సోమరిపోతు...
సిరుల కురిసే...పసిడి పండే...
పచ్చని పంట భూమిని 
బంజరు భూమిగా మార్చి ఆపై 
ఆకలై అన్నమోరామచంద్రా అంటాడు 
 
ఫలాలనిచ్చే పచ్చని వృక్షాలను 
నవ్వుతూ గొడ్డలితో నరికేస్తాడు ఆపై 
నీడలేక నిట్టూర్పునిప్పుల్లోనిలుస్తాడు

ఒక అజ్ఞాని... 
ఒక శాడిస్టు...
ఒక అహంకారి...
అంధకారాన్ని సృష్టిస్తాడు 
చింతిస్తూ చీకట్లో కూర్చుంటాడు...

ఆరని అగ్నిని 
రగిలించి సర్వం 
ధ్వంసంచేస్తాడు దగ్ధం చేస్తాడు
నిరాశ నిస్పృహలతో 
కృంగిపోతాడు కుమిలిపోతాడు
ఆపై ముళ్ళబాటలో పయనిస్తాడు

ఓ జ్ఞాని మండే ఆ అగ్నితోనే 
రుచికరమైన వంటలు చేయించి
ఎందరికో క్షుద్భాధను తీరుస్తాడు 

అందుకే 
ప్రతిమనిషి తమ శ్రమ శక్తిని 
విజ్ఞానం విలువను తెలుసుకోవాలి 
జ్ఞానం అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి
బుద్ధుని దారిలో బుద్ధిజీవిగా జీవించాలి



కామెంట్‌లు