*అవయవాల ఔన్నత్యాన్నికాపాడుకో..! *:- కోరాడ నరసింహా రావు!
 ఒక్కో మారు ప్రత్యక్షమ్గా... 
  కన్నవే నిజం కావని రుజు వవుతుంది....! 
   ఇంక , విన్న వన్నీ నిజమని నమ్మి... 
  ఐన వారిని దూరం చేసుకునే సందర్భాలూ లేక పోలేదు...! 
   కేవలం విన్నవే కాదు, ప్రత్యక్ష0గా కన్నవి కూడా నిజం కాక పోవచ్చు ! 
మన బద్దెన వినదగు నెవ్వ  రుచెప్పిన , "వినినంతనె వేగ పడక వివరింప దగున్ 
గని కల్ల, నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు మహిలోసుమతి"అన్నాడు
విన్న వెంటనే మనం నిర్ణ యాలు తీసేసుకో కూడదు
నిజా నిజాలు తేల్చుకో కుండా తొందర పడరాదు! 
ఇంక నోరు...! 
  "నోరా వీపుకు తేకే" అన్నారు పెద్దలు..! 
 అంతే కాదు, నోరు మంచి దైతే ఊరు మంచి దౌతుం దన్నారు...! 
  అంతే కదా...! 
  నోరుందని ఇష్టం వచ్చి నట్టు వాగితే ఆ మాటకు గానీ, ఆ మనిషికి గానీ విలువుండదు...! 
అందుకే అన్నారు..., 
 "సత్యం భ్రూయాత్ ... ప్రియం భ్రూయాత్... 
 న భ్రూయాత్ సత్య మప్రియం...!"
  
అంటే మన మెప్పుడూ సత్యమునే పలకాలి...! 
 అది సత్యమే ఐనా... ప్రియము గానే పలకాలి... 
  అది వారి మనసును కష్ట పెడుతుందేమోనని అసత్యాన్ని మాత్రము చెప్ప రాదు...! 
మనం చెప్పే అసత్యము వలన ఎవరి మనసు నొప్పిస్తామో , యే జీవితం కూలి పోతుందో ... ఎంతటి పాపానికి ఒడి గట్టిన వారి మౌతామో ఫలితంగా ఎలా0టి బాధలు కలుగు తాయో... ఊహించ లేము! 
అందుకే అన్నారు... 
 "పుణ్యం గొడుగు... 
      పాపం పిడుగు " అని! 
  
మనకు ఆ పరమాత్మ దివ్య మైన అవయవాల నిచ్చింది... సక్రమంగా వినియో గించుకుని..., సుఖ, శా0తులతో, హాయిగా ఆనందంగా బ్రతక మని... 
     దుర్విని యోగంచేస్తు 
ఇతరులను బాధిస్తూ, మనను బాధ పడ మని కాదుగా....!! 
  కనుక, ఎవరేమి చెప్పినా నమ్మీ వద్దు...! 
   ఎవరికైనా, అసత్యాలు చెప్పవద్దు...!! సరేనా... 
      *****

కామెంట్‌లు