తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్
ఆధ్వర్యంలో 100 కవులకు తెలుగు భాష సేవా స్ఫూర్తి పురస్కారాలు ప్రదానo
విజయవాడలో ఆదివారం 28 తేదీ. హనుమంతరాయ గ్రంథాలయములో డా.యు.వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఉషోదయ ఫౌండేషన్ వారు డా. ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు నిర్వహణలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తిస్తూ తెలుగు సేవా స్ఫూర్తి పురస్కారాలను హనుమంతరాయ గ్రంథాలయoలో ఆదివారం మధ్యాహ్నము నాలుగు గంటలు నుంచి రాత్రి 9 గంటలు వరకు అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించడము జరిగింది. ప్రముఖులు డా .జి.మురళీ కృష్ణ రిటైర్డ్ ఆడిషినల్ ఎస్పీ గోశాల సేవా ట్రస్ట్ చైర్మెన్ డా .జగదీశ్వర రావు ప్రముఖ న్యాయవాది మరియు డా .వి డి .యస్ .ప్రసాద్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చేతులు మీదుగా తెలుగు భాష సేవా స్ఫూర్తి పురస్కారాలను 100 మంది కళాకారులకు అందజేయడం జరిగింది .సంప్రదాయ నృత్య ప్రదర్శనలుతో కనువిందుచేసిన వారికి నాట్యమంజరి సేవా పురస్కారం తో సత్కరించడం జరిగింది.అలనాటి మేటి పాటలతో రసజ్ఞలైన ప్రేక్షకులను సింగర్స్ పాత కొత్త కలయికతోటి ముచ్చటగా అలరించారు..రెండు తెలుగు రాష్ట్రాల నుండి 100 మంది కవులు కళాకారులు సభలో పాల్గొన్నారని డా. ధనాశి ఉషారాణి పోగ్రామ్ కన్వీనర్ తెలియజేశారు. తెలుగు భాషకు వన్నె తెచ్చే మేటి కార్యక్రమమే ప్రతిభ అవార్డుల కార్యక్రమంతో అందరినీ సత్కరిస్తూ మునుముందుకు బావి జగతికి కళలను తీసుకెళుతున్నట్టు. డా. యు. వి రత్నo తెలియజేశారు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి