వచ్చింది వత్సరం: -గంగరాజుపద్మజ
 వచ్చింది కొత్త ఆంగ్ల వత్సరం
స్వాగతగీతి పాడుదాం 
మనమందరం ముక్తస్వరం 
సుస్నేహ పరిమళాల పన్నీరు చల్లుదాం
చలివేళ వెచ్చని శాలువా కప్పుదాం
మంచుపచ్చిక తివాచీ పర్చుదాం 
మెత్తని పాదాల  వత్తుగా 
సుమాలను విసురుదాం 
ఆతిథ్యం అందుకొమ్మని వేడుదాం
ఆనందగీతికలు పాడుదాం


కేకులు స్నాకులు కొసరుదాం 
చిర్నవ్వుల ఛలోక్తులు విసురుదాం 
వచ్చిన నవవత్సరం మెచ్చింది
మనకు సందేశమిచ్చింది 
కష్టసుఖాలు, ఇష్టాయిష్టాలు కలబోద్దాం 
గతాన్ని నెమరేద్దాం 
జూదాలు సారా నేరాలు దూరంపెడదాం
గీత వాద్యనృత్యాలతో 
ఉత్సవాలు జరుపుదాం
క్రమశిక్షణ తో దేశ రక్షణ కై
నడుంబిగించి నిలుద్దాం🌹
కామెంట్‌లు