ఖేలో ఇండియా ఉమెన్స్ ఓపెన్ టు ఆల్  షూటింగ్ బాల్ ఎంపికలు
 తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ .ఐలయ్య ఆదేశాల మేరకు, వికారాబాద్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి . ఎం.రాములు ఆధ్వర్యంలో ఈ నెల 6న శనివారం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఎం జె పి బాలుర గురుకుల పాఠశాలలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఖేలో ఇండియా ఉమెన్స్ ఓపెన్ టు ఆల్  షూటింగ్ బాల్ ఎంపికలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.గోపాలం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, ఉపాధ్యక్షుడు అంజి హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని షూటింగ్ బాల్ ఖేలో ఇండియా క్రీడలను ప్రారంభించి, బాలికలు మహిళలు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు లభిస్తాయని తెలియజేయడం జరిగింది,  తాండూరు పట్టణంలో వికారాబాద్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాములును

వారుఅభినందిస్తూ, ఈ ఉమ్మడి జిల్లా స్థాయిలో షూటింగ్ బాల్ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులను ఎంపిక చేసి ఈనెల 13, 14 తేదీలలో తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ హైస్కూల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా ఉమెన్స్ షూటింగ్ బాల్  రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు పంపుతామని వారు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి గోపాలం క్రీడలలో నైపుణ్యతను ప్రదర్శించిన బాలికలకు 25 మందికి మెడల్స్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహన కార్యదర్శి రాములు , పిడి పి ఇ టి లులో రాము, గోపిక, బాలమణి, జ్యోతి, రవీందర్ రెడ్డి, మోహిజ్ సాహెబ్ఎం జె పి పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఈటిలు బాలికలు మహిళలు వందమంది పాల్గొన్నారు.

కామెంట్‌లు