సత్ప్రేరణ విజయానికి సోపానం:- కవి మిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-హైదారాబాద్
బాల్యంలో అమ్మ తాను తినకున్నా తిన్నా
అక్షరం ముక్క వస్తే అన్నానికి లోటుండదని
నాన్న లేకపోయినా అన్నీ తానై భయం లేదు
చదువుతో బాటు సంస్కారం ఉండాలన్న  ప్రేరణతో 
స్వామి వివేకానంద చెప్పినట్లు
ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పంతో
ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని చేరగలవు అన్న  మాటలతో

మానవునిగా పుట్టడం గొప్పకాదు
మానవత్వంతో ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం ఇవ్వాలన్న
స్వామి వినోబాబావే మాటలువిని
ప్రార్ధించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్న
భారతరత్న మధర్ థెరిస్సాను ఆదర్శంగా 

శాంతి అహింసలే సాధనాలుగా స్వాతంత్ర్య సముపార్జన చేసిన 
మాహాత్మా గాంధీ
సనాతన ధర్మమే వసుదైకానికే  ఆదర్శమన్న
నడయాడిన పరమేశ్వర స్వరూపమైన కంచి పరమాచార్య
సాధించలేనిది ఏది లేదు అంతరిక్షపరిశోధనల
సముద్రగర్భ నిక్షిప్తశోధనలోనైన అన్న
పేపర్ బాయ్ నుంచి క్షిపణిపితామహునిగా
దేశ అత్యున్నత అధ్యక్ష పదవికి ఎదిగిన
భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలామ్ వంటి
మహనీయుల ప్రేరణతో  తప్పక అనుకున్న గమ్యాన్ని చేరవచ్చు..!!
........................


కామెంట్‌లు