నీరెండతో దోబూచులాడే
నీలాల కన్నుల్లో స్వప్నాలు
నిజమయ్యే దారులేవో
వివరంగా తెలిపేలా....
అడుగు వేసే తొందరలో
అడుసు పాల పడకుండా
అప్రమత్తంగా ఉండాలని
అదును కోసం ఆగాలని.....
అలుపులేని గమనంలో
అనుకోని ఆపదలొస్తే
అలజడి పొందక ఉపాయంగా
అధిగమించే తీరాలని......
నిరీక్షణలో ఆలస్యానికి
నీరసించి నిలిచిపోతే
దూరమేమి తరగదు
కాలం అసలే ఆగదని.....
ఏటి తీరం ఎవరికెరుక
బాట వెంబడి స్వాగతించే
సాటిలేని అందాలను
కంటి విందుగా అస్వాదించాలని...
గమ్యం కన్నా మిన్న అయిన
గమనంలోనే నిజమైన
బ్రతుకు విలువ తెలిసి
భ్రమలు తొలగి పోవునని....
పయనమే పరమావధిగా
ప్రతి ఉదయం నేర్పే పాఠం
ప్రతి మదికి చేరాలని
ప్రభవించే వేలుపుకు...
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి