మన దేశంలో ఏపండగ వచ్చినా వాకిలిని పేడనీటితో కళ్లాపి జల్లి ముగ్గు పెడతాం.ఇక సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు ఆవుపేడతో చేసి పెడతాం.మన పేడకి విదేశాల్లో బాగా డిమాండ్ పెరిగింది ఇప్పుడు.చైనా కువైట్ తో సహా ఎన్నో దేశాలు మన దగ్గర నుంచి పేడను దిగుమతి చేసుకుంటున్నాయి.దీపావళితర్వాత గోవర్ధనపూజ లో పేడతో గోవర్ధనపర్వతం లా చేసి పూజిస్తారు.దాదాపు అన్ని దేశాలు మనదేశం నుంచి ఎందుకు పేడ కోసం ఎగబడుతున్నాయి!? మనదేశంలో 30 కోట్ల పశుసంపద వల్ల 3 కోట్ల టన్నుల పేడ లభిస్తోంది.పిడకలు చేస్తాం మనం.కానీ చైనా బ్రిటన్ లో విద్యుత్తు బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు.మిగతా దేశాల్లో ఎరువుగా వాడుతున్నారు.ఈపేడ వెల కిలో 30_50రూపాయలు.హైగ్రేడ్ పేడతో తయారైన పొడి ఖరీదైనది. గత ఏడాది కువైట్ 192 మెట్రిక్ టన్నుల పేడని భారత్ నుంచి కొన్నదంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ?పొలంలో రసాయనాల మందులు క్రిమిసంహారక మందులు బదులు పేడను వాడుతున్నారు.మట్టికి మంచి బలం ఇస్తుంది.కువైట్ లో భారతీయ పేడతో తయారైన పౌడరువల్ల ఖర్జూరపండు బాగా పండుతోంది దాని ఆకారం రుచి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని అంతా మెచ్చుకుంటున్నారు.నీటి కొరత ఉన్న దేశాల్లో గిరాకీ బాగుంది. రసాయనాలతో కాన్సర్ ముప్పు ఎక్కువ అవుతోంది.అందుకే మనం పశుసంపద ను కాపాడుకుంటూ పేడని సద్వినియోగం చేద్దాం.ఆవుపేడ క్రిమిసంహారిణి. అందుకే గోమాత అని పూజిస్తాం. ఇప్పటికైనా మనం అన్ని పాడిపశువులపట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.గోవధను అక్రమ రవాణాను అరికట్టకపోతే మనకు భవిత లేదు.పురాణాల్లో గోవు దూడ తో సహా అన్నింటినీ పూజించమనే చెప్పారు.ముసలి గోవులను పొలాల్లో వదిలితే వాటి పేడతో భూమి సారవంతమవుతుందని తెల్సుకుందాం.🌹
తెలుసుకుందాం! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి