దస్తూరీ లేఖనం, ఉచ్ఛారణ, ఉక్తలేఖనం, వక్తృత్వ, పఠన పోటీలందు మిక్కిలి ప్రతిభ కనబర్చుచున్న చిట్టి చిన్నారులైన గొట్టాపు షణ్మిత, జి.మిత్రశ్రీలకు ప్రోత్సాహక బహుమతులను అందజేసినట్లు జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు తెలిపారు. పార్వతీపురం మన్యం పుస్తక మహోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన వంగపండు, భూషణం, గణేష్ పాత్రో వేదికపై వీరిద్దరికీ పుస్తకాలనందజేస్తూ ఆయన సత్కరించారు. తన రూపకల్పనలో రూపొందించబడగా, సైన్స్ ఉపాధ్యాయులు, రచయిత రౌతు నరసింహప్పడు రచించిన స్వచ్ఛ జీవనం పుస్తకాలను తిరుమలరావు బహూకరించారు. లక్షకు పైగా పుస్తకాల ప్రదర్శన, క్రయవిక్రయాలు, ఆవిష్కరణలు, సమీక్షలు, విశ్లేషణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పదకొండు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలలో అనేక మంది సాహిత్యవేత్తలకు బాలలకు తమతమ ప్రతిభను చాటుకునేలా ఈ మహోత్సవం వేదికైనదని తిరుమలరావు తన హర్షాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా గూర్చి స్వీయ గీతాన్ని ఆయన ఆలపించిరి. కార్యక్రమంలో జి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
షణ్మిత, మిత్రశ్రీలకు ప్రోత్సాహక బహుమతులు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి