సాహిత్య సౌరభాలు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అక్షరాల తోటలో
అల్లుకున్న భావపుష్పాలు
పదాల పుప్పొడితో
పరిమళించు సౌరభాలు

కలం తాకితే
హృదయమే వికసించి
మౌనాల మడిలోంచి
మధురనాదం పొంగుతుంది

శబ్దాలే శిల్పాలై
భావాలే రంగులై
మనసు గవాక్షంలో
అందాల చిత్రాలవుతాయి

వేదనకూ ఓ పరిమళం
ఆనందానికీ ఓ వాసన
సాహిత్య సౌరభాలే
జీవితానికి జ్ఞానగంధం

కాలం మారినా
కలముశక్తి తరగదు
కవితా సౌరభాలు
తాకుతూనే ఉంటాయి 

సాహిత్యసౌరభాలు
ఆస్వాదించుదాం
అంతరంగాలను
ఆనందపరుద్దాం


కామెంట్‌లు