జై జవాన్.... జై జవాన్;- గుండాల నరేంద్ర బాబు
మాతృ భూమి రక్షణకై పుట్టిన వీరాధి వీరుడు
శత్రు మూకల తుదముట్టించే ధీరాధి ధీరుడు
ధరణిలోనే ధన్య చరితుడితడు
అవనిలోనే పుణ్యజీవి యితడు
రేయనక పగలనక పహారా కాస్తాడు
కష్టాలతో ఇష్టంగా సహజీవనమే చేస్తాడు
సుఖాలకే కడు దూరంగా ఉంటాడు
దుఃఖాలనే దిగమింగే గరళ కంఠుడితడు
జన్మభూమి సేవలో తరించే కారణ జన్ముడు
ధన్య భూమి సేవకై  పరితపించే హితుడు 
ప్రాణాలను తృణ ప్రాయంగా భావించే శూరుడు
 అక్రమార్కుల పనిబట్టే విక్రమార్కుడితడు
 ఉగ్రవాదుల పాలిట ఉగ్ర నరసింహుడు
 శతృదేశాల వాకిట సింహస్వప్నమితుడు
 తీవ్రవాదుల ముంగిట యమకింకరుడితడు
భరతమాత సేవలో బాధ్యత గల పౌరుడు 
అతడే అతడే భరతమాత ముద్దుబిడ్డడు
అతడే అతడే  విశ్వశాంతి కాముకుడు
అతడే అతడే మాతృభూమి ప్రేమికుడు
అతడే అతడే అజరామర
అమర చరితుడు 
నిలువెల్లా దేశభక్తి నింపుకున్న ధీరోదాత్తుడు
 దేశ రక్షణకై అసువులు బాసే అమరవీరుడితడు
కన్న వారికి సైతం దూరమయ్యే కరుణామయుడు
కడకు కట్టుకున్న వారి కన్నా కన్నభూమి మిన్ననే త్యాగధనుడితడు 
కార్యదీక్షలో కణ కణ మండే దీక్షాదక్షుడితడు
మంచు కొండల్లో కంచు కంఠమైనవాడు
మండుటెండల్లో పండు వెన్నెలై నిలిచిన వాడు
నిలువెత్తు త్యాగానికి నిదర్శనమైన వాడు
నిస్వార్థ సేవకు నిజ దర్శనమై నిలిచిన వాడు
అతడే భరత మాత నుదుట వీర తిలకుడు
అతడే భారతీయ స్థైర్య  శౌర్య సైనికుడు
జై జవాన్.... జై జవాన్.... జై జవాన్...
జై హింద్... జై హింద్.... జై హింద్...
=========================================


(  07 డిసెంబర్ సాయుధ దళాల పతాక దినోత్సవం  నేపథ్యంలో అమరులైన భారత సైనికుల స్మారకార్ధం రాసిన కవిత )
===========================================
 సెకండ్ ఆఫీసర్ 
గుండాల నరేంద్రబాబు
 అసోసియేట్ ఎన్ సి సి ఆఫీసర్
 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్ సి సి &
నగరపాలక ఉన్నత పాఠశాల వెంగళ రావు నగర్, నెల్లూరు
 సెల్ 9 4 9 3 2 3 5 9 9 2
కామెంట్‌లు