ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుండి మినహాయించాలి: --- యుటిఎఫ్
 సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు టెట్ పరీక్ష ఉత్తీర్ణులవ్వాలన్న నిబంధన ఎంత మాత్రం సమంజసం కాదని, టెట్ నుండి మినహాయింపునివ్వాలని, విద్యా శాఖామంత్రి రివ్యూ పిటిషన్ వేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు డిమాండ్ చేశారు. రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో యుటిఎఫ్ డివిజన్ స్థాయిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశం అనంతరం ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లను పెద్ద ఎత్తున నినదించారు. ఈ మేరకు యుటిఎఫ్ పక్షాన రాజాం తహశీల్దార్ డి.రాజశేఖర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. 

డిమాండ్స్ లో ప్రధానంగా 

2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయింపునివ్వాలని, హైస్కూల్స్ కు వందరోజుల యాక్షన్ ప్లాన్ నుంచి ఆదివారాలు, సాధారణ సెలవులను మినహాయించీ రీ షెడ్యూల్ విడుదల చేయాలని, బదిలీ అయిననూ ఇంకా రిలీవ్ చేయని ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలని, ఏకోపాధ్యాయుల పనిభారం వత్తిడిని తగ్గించేలా డెప్యుటేషన్ పై అదనపు పోస్ట్ లను డెప్యుటేషన్ పై నియమించాలని, బోధనేతర పనులను ఉపాధ్యాయేతరులకు అప్పగించి, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, యాప్ ల విధానాలు రద్దుచేసి రాతపనులు తగ్గించాలని కోరుతూ  వినతిపత్రం అందజేశారు. సదరు డిమాండ్స్ ను ర్యాలీలో పెద్ద ఎత్తున నినదించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎపియుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా కార్యదర్శి పక్కి వాసు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.కృష్ణమూర్తి, ఎ.వెంకట అప్పలనాయుడు, రాజాం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మువ్వల రమేష్, బెవర జగదీష్, సంతకవిటి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బూరాడ శ్రీనివాసరావు, డోల కృష్ణారావు, జి.సిగడాం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె.సన్యాశిరాజు, సిహెచ్ దాలిరాజు, జిల్లా కౌన్సిలర్లు కుదమ తిరుమలరావు, ఎం.ప్రసాద్, సీనియర్ సభ్యులు పల్ల మురళి, మూడడ్ల శ్రీనివాసరావు, వి.ప్రవీణ్ కుమార్, ఆనంద్, జి.చంద్రశేఖర్, జి.రమేష్, కె.కిశోర్ కుమార్, ఆర్.దాలినాయుడు, ఎస్.లక్ష్మణరావు, సూర్యనారాయణ, ఎం.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు