ఒక ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు, ఆ ఇంట్లో అంతా అకస్మాత్తుగా మారిపోతుంది.
ఒక్క క్షణం, ఆ బిడ్డ అరుపు వినడానికి వాళ్ళు పరిగెడతారు. ఆ బిడ్డతో మాట్లాడటానికి పోటీ పడతారు. కానీ ఆ బిడ్డ తన ధోరణిలో తన ప్రపంచంలో ఉంటుంది. లేలేత గులాబీ రేకుల్లాంటి పెదవులపై చిన్న నవ్వు నవ్వుతుంది. ఆ నవ్వుని చూసి ఎవరికి వాళ్ళు తమను తలచుకునే నవ్వుతోందంటారు. ఇంతలో ఓ బామ్మ "ఒరేయ్, ఆ బిడ్డ ఆ భగవంతుడితో మాట్లాడుతూ నవ్వుతోంది రా" అంటుంది.
ఆ నవ్వు ఎవరికోసమో అయితే అయి ఉండొచ్చు కానీ "నిశ్శబ్దం...నిశ్శబ్దం...ఎవరూ మాట్లాడకండి...బిడ్డ పడుకోని" అని ఇంకొక గొంతు వినిపిస్తుంది నెమ్మదిగా. తల్లి మనసు రెప్పార్పక బిడ్డ వంకే చూస్తుంది. ఇల్లంతా బిడ్డ వాసనే...
అదే విధంగా, శ్రీరంగంలో, మొత్తం పట్టణం ఆ దైవ ప్రాంగణం చుట్టూ తిరుగుతుంది.
"మీరెవరైనా ఆ ప్రాంగణాన్ని చూశారా? ఈరోజు అలంకరణ ఏమిటి?" యావత్ పట్టణం ఆ ప్రాంగణం గురించే మాట్లాడుకుంటుంది. ఆ ప్రాంగణంతో గడిపే సమయమంతా తన్మయత్వమే.
గోదాదేవి... తిరుప్పావై...అందరి నోటా ఇవే మాటలు... వినిపిస్తాయి. ఎవర్ని పలకరించినా ఆ గోదాదేవి తల్లి తనను అర్పించుకున్న స్వామి గురించేకథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ ఆనందమే ఆనందం....అందుకే ఓ బిడ్డ పుట్టడం తోనే ఇంట్లోని వాతావరణమంతా మారిపోతుంది. ప్రతి అడుగులోనూ ప్రతి మాటలలోనూ ప్రతి పనిలోనూ ఆ చిట్టితల్లి తలపులే ఉంటుందనడం అతిశయోక్తి కాదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి