జ్ఞాపకాన్ని నరికేసిన
మొద్దు మొలకెత్తినట్లు
మళ్లీ మొలకెత్తుతూనే ఉంది.!
జ్ఞాపకాన్ని విసిరేసిన
విత్తనం మొలకెత్తినట్లు
మళ్లీ మొలకెత్తుతూనే ఉంది.!!
జ్ఞాపకాన్ని పండుటాకుల రాల్చిన
మళ్లీ చిగురులా
చిగురుస్తూనే ఉంది.!!
జ్ఞాపకాన్ని మొగ్గలోనే తుంచిన
వేర్లలో
దుంపల కాస్తూనే ఉంది.!!
జ్ఞాపకం పువ్వుల్లా రాల్చిన
కాయల్లా కాస్తూనే ఉంది.!!
జ్ఞాపకాన్ని కాండం లా
ముక్కలు ముక్కలుగా నరికిన
నేలల్లో వేర్లల్లా పుడుతూనే ఉంది.!!
జ్ఞాపకాన్ని మట్టిలోంచి వేరు చేస్తున్న
జ్ఞాపకం మట్టిలో కలిసిపోయింది
జ్ఞాపకాన్ని గాలిలోంచి వేరు చేస్తున్న
జ్ఞాపకం గాలిలో కలిసిపోయింది.
జ్ఞాపకాన్ని వెలుగులోంచి వేరు చేస్తున్న
జ్ఞాపకం వెలుగులో కలిసిపోయింది.
జ్ఞాపకాన్ని నీటిలోంచి వేరు చేస్తున్న
జ్ఞాపకం నీటిలో కలిసిపోయింది.
జ్ఞాపకాన్ని ఉనికిలోంచి తొలగిస్తున్న
జ్ఞాపకం చచ్చిపోయింది.!!!!!!!!!!!!!!.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి