పురాతన కాలంలో, జపాన్‌లో ఒక వింత ఆచారం ఉండేది.
తల్లిదండ్రులు వృద్ధులై, ఇతరులకు వారి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అనుకున్నప్పుడు, వారిని మోసుకెళ్ళి ఎత్తైన పర్వతాలపై వదిలేస్తారు.
వృద్ధులు ఏమీ చేయలేక, ఆకలి, దాహంతో ఏకాంతంలో చనిపోయే వారు.
అటువంటి పరిస్థితిలో, ఒక యువకుడు తన వృద్ధ తల్లిని మోస్తూ ఓ అడవి గుండా వెళ్ళి పర్వతంపై నడుస్తున్నాడు. అలా పోతున్నప్పుడు
ఆ వృద్ధ తల్లి, సువాసనగల చెట్ల నుంచి చిన్న చిన్న కొమ్మలను విరిచి నేలమీద పడవేయటాన్ని కొడుకు గమనించాడు.
వెంటనే, "అమ్మా, నువ్వు చెట్టు నుంచి కొమ్మలను విరిచి పడేస్తున్నావు... ఎందుకు?" అని అడిగాడు.
అప్పుడా తల్లి ఇలా అంది, "కుమారా, నువ్వు నన్ను కొండపై విడిచిపెట్టి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు, దారి తెలియక తప్పిపోకూడదు కదా? నేను కింద పడేస్తున్న కొమ్మలను అనుసరిస్తే, నువ్వే మాత్రం తడబడకుండా సురక్షితంగా ఇంటికి చేరుకోవచ్చు. అందుకే నేను కొమ్మలను నీకోసం పడేస్తున్నాను" అని.
ఆ కొడుకు అంత్యదశలోనూ తన గురించి ఆలోచిస్తూ ఇంటికి సురక్షితంగా చేరుకోవాలని కోరుకున్న ఆప్యాయతగల తల్లి మనసు తలచి అతను బాధపడ్డాడు. తను చేస్తున్నది తప్పని గ్రహించాడు. అంతేకాదు, తన తల్లిని తిరిగి ఇంటికి తీసుకువచ్చి ఆమెను ఆప్యాయంగా చూసుకున్నాడు ఆ కొడుకు.
ఈ ఉదంతం తర్వాత, ఆ క్రూరమైన అలవాటు ఆ దేశం నుండి అదృశ్యమైంది.
ఈ కథ వెనుక ఉన్న ఆలోచన మన జీవితాలకు చాలా ముఖ్యమైనది.
నువ్వు మంచివాడివో చెడ్డవాడివో నీకు తెలియకముందే నీ తల్లి తన గర్భంలో నీకు చోటు ఇచ్చింది.
నువ్వు ఎన్ని జీవితాలు సంపాదించినా, నువ్వు నివసించే ఇంటికి అద్దె చెల్లించలేకపోతే, అది నీ తల్లి గర్భం అని మర్చిపోకు.
మనుషుల్లో కొందరు ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు, వికారాలు, అవమానాలు అనుభవించిన తర్వాత, ఏమీ తెలియనట్లు నటిస్తూ, తన కుటుంబం మధ్యలో నవ్వుతూ సాగిపోయారు. మన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ పిల్లల సంక్షేమం గురించీ ఆలోచిస్తారు. కనుక వారిని మన కంటికి రెప్పలా కాపాడుకోవడం పిల్లల కనీసం కర్తవ్యం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి