సామెత -79; అమ్మ కళ ఆకిట్లనే తెలుత్తది
*****
"అవ్వా! గా శోబమ్మ ఇల్లు జూసినవు గద!లచ్చలు లచ్చలు బోసి కట్టించిండ్రు.అద్దాల మేడ.అచ్చు సైన్మాల జూసినట్టె ఉంది గని..."
గదేంది శెల్లె! గిప్పుడే కొత్తగ్గట్టినట్టు చెబుతున్నవ్.శాన్నాల్లయిందిగ.గాళ్ళు ఇంట్లెకు బోయినప్పుడు ఊళ్లె అందర్ని బిల్చి శెయ్యి గడిగిచ్చిండ్రు. సత్నారాయన వ్రొతం సుత జేస్కుండ్రు.నువ్వు గప్పుడు పోలేదా శెల్లె!
"ఎహె! నేనేందుకు పోలేదవ్వా! మాగనే పోయిన తీ! గా ముచ్చటి గాదు నీకు జెప్పేది.అద్దాల మేడ లెక్క ఉన్న గా కొంపను కంపు కంపు జేసిందన్కో. ఓ సుచీ లేదు సుబ్రతా లేదు. ఇంట్లె బట్టలుతికే మిషిని ఉంది. దానికేం పన్లేక ఓ మూలని పడుంది. ఇంగ ఎక్కడ జూస్నా అద్దెలకద్దెలు ఉత్కుడు బట్టలు. వంటర్ల ఓ శిన్న గుండ్రని మిషిని వుంది.గదే ఇల్లంత తిరిగి గదిని శెక్కున మెర్సేటట్లు చేత్తదట.ఇంగ గివ్వీటితో ఏం జేత్తరో శెప్పిన గద!"
"ఏంది శెల్లె!భలే గమ్మత్తి జేత్తున్నవ్.నన్ను ఏం దెల్వని ఎడ్డిపోరి లెక్క గట్ల అడ్గబడ్తివి. గవన్ని ఇంట్లె ఉన్నంక ఇంగ పనేముంటది. శెక్క శెక్క పన్జేసుకునుడు.చెక్కున ఇల్లును అద్దంల మెర్పిచ్చుడే"అంటున్న అవ్వతో ...
"అగ్గో అవ్వోవ్! నువ్వు గక్కన్నే తప్పుల కాలేశినవ్! అద్దెలకద్దెలు ఉత్కుడు బట్టల్తో, ఇంటి నిండ పర్శిన బోళ్ళు బొచ్చెల్తో ఆగమాగం అడివడివి.ఇంగ ఆకిట్లెకి అడుగు బెట్టంగనే ఎట్లబడ్తె అట్ల పెంచిన మొక్కలు. శెత్తా శెదారం...సూత్తుంటే ఏ భూతాల బంగులాకో పోతున్నట్టనిపిత్తది అవ్వా!"
"ఇంగ గట్లనే పన్లె పనిగ శాంతమ్మింటికి సుత బొయ్యొచ్చిన."
'అవునా శెల్లె!పాపం పేదరాలు. శోబ లెక్క ఆత్తిపాతులు లేవు,ఆళ్ళిళ్ళు బొమ్మరిల్లు లెక్క శిన్నగుంటది."
"అవునవ్వా! శిన్నిల్లు అయితేంది.గా ఇంట్లెకి బోతుంటే రొండు అయిపులా పూల మొక్కలు.శెట్లతో పచ్చగ కలకల్లాడ్తుంటది.అచ్చం సీతమ్మోరు పర్ణశాల గిట్లనే అందంగ ఉండేదేమో అనిపిత్తది.ఇంగ ఆకిట్లె పర్సిన ముగ్గులు గా శాంతమ్మ మనసు లెక్క తెల్లగా,అందంగ కనిపిత్తుంటయి."
"శెల్లే! గందుకే అంటరు "అమ్మ కళ ఆకిట్లనే తెలుత్తది అని" గా శోబ ఎంత ఇవురం తక్వదో నీ మాటల వల్ల సమజైంది. గింతకీ తనకి శాత గాకపోతె పన్జేయడాన్కి ఓ మణిషిని పెట్ఠుకుంటె ఏం బాయె.లేక సత్తుండా దాని మొగుడు.రోడ్ కాంటాక్టులు పట్టుకొని గురగులు గుర్గులు నింపుకుంటనే ఉండు గద!.
"పాపం శాంతమ్మని జూడు.తాను సుత మొగుడితో కల్సి కూలి నాలికి పోతది. గుట్టుగా సంసారం నడుపుకుంటున్నది.ఉన్నంతలో పిల్లగాండ్లిద్దరిని సక్కగ సద్విచ్చుకుంటున్నది. ఇంతకీ ఎట్లుంది? నేను సుత ఓ త్యేప ఎల్లాలి?"
"అవునా శెల్లె! గాళ్ళిద్దరి నడ్మ ఎంత ఫరకుంది. మళ్ల శెబ్తున్నని ఏమన్కోకు."అమ్మ కళ ఆకిట్లనే తెలుత్తది" అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి