సామెత -83- అగ్గో అంటే ఆరునెల్లు ఇగ్గో అంటే మూడు నెల్లు
******
"ఏం మణిషో ఏమోనే శెల్లె! రెక్కల కట్టం మీద బత్కేటోళ్ళం .మణిషిలో కాగడా పట్టి ఎత్కినా కాసింతైన సురుకుదనం లేదు. ఏజ్జెప్పినా సేత్త తీ, సూత్త తీ అనుడే.మన్ను దిన్న పామోలె ఉండద్దయ్యా! కాత్తన్న కుశాలుగుండాలి. సోమరిగా కూకుంటే పన్లెట్లయితయి?"
గట్ల కూసోని కూసోనే ఉన్న గిరాకీల్ని గంగల కల్పిండు. గిప్పుడు సేతులు ముందేసుకుని కూసున్నడు 'పన్లేదాయె - పాట లేదాయె' అంటే ఏం పాయిదా? ఐదేళ్ళు లోపల్కి బోవాలంటే ఒక్క దినం ఇడ్వకుండ కూల్కి బొయ్యే గతి పట్టించిండు.అయినా గిప్పుడు నా ఎతను జూసి జాలి పడటం ఎందుకు?"
ఆగని ఏటొతికె సొద మీద సొద సెప్పుకుంటున్న నీలవ్వను సూత్తుంటే మస్తు బాదన్పించింది అవ్వకు."
" ఓ అక్కా! గీ లోకంల ఒక్క నీ మొగుడు మాత్తరమే కాదు.గస్మంటి మొగోళ్ళు శాన మందిరే ఉన్నారు.... "గాళ్ళు శెబితే ఇనరు -ఒంట బుట్టదు. గస్మంటోళ్ల ఇండ్లల్ల ఇంటాడది నెత్తినిత్తులు ఏస్కున్న కానించి వొంచిన నడ్ము ఎత్తకుండా, ఇజ్జత్ కోస్రం ఇంటా బయటా శాకిరి చేస్కుంట గుట్టుగ సంసారం ఎల్లదీత్తుంటది".
కొంత మందిర్కి ఏం జెప్పినా శెవిమీద పేను బారినట్టు ఉండదు. నిమ్మకి నీరెత్తినట్టు ఉంటరు.దున్నపోతు మీద వాన బడ్డట్టె. "శెవ్వా! ఏం మడుసులో ఏమో?" అగ్గో అంటే ఆరునెల్లు ఇగ్గో అంటే మూడు నెల్లు" ఒచ్చిన గిరాకీ సెయ్యకుంటే మల్లెవలన్న వొత్తరా. ఇంగ గీళ్ళ మీద ఏమన్న నమ్ముకం ఉంటుందా?తప్పి దారి ఒకేల ఒచ్చినోడు మల్లొత్తె అంతొట్టు. పనిచ్చినోడు తిర్గి తిర్గి కాళ్ల శెప్పులు,ఒంట్లె ఓపిక పోగొట్టుకుంటడు.గట్లుంటది గీల్ల సోమరితనం" అంటుంటే...
"అవ్వతో జడలేయించుకుంటున్న భూలచ్మి యిని "అగ్గో అంటే ఆరునెల్లు- ఇగ్గో అంటే మూడు నెల్లు " అంటేందవ్వా? అడిగింది.
"నువ్వు, తమ్ముడు బల్లె సార్లు జెప్పిన ఇంటిపనిని ఎంటనే పూర్తి సెయ్యకుండా మురగబెట్టుకుంటరు. అగ్గో ఇగ్గో అని శెయ్య కుండా ఆపుకొని మోకామీదికి వొచ్చినంక లబలబలాడ్తరు గద! గట్లనే సైమమంత అద్గో ఇద్గో అని దినాల్ని డొలిపే వాళ్ళని దుట్టిలో పెట్టుకుని గీ సామెతను వాడుతారు."
"అవ్వా! మేం శానా మంచోళ్ళం. అగ్గో అంటే,ఇగ్గో అంటే అన్న పదాలనే ఆడం. జింక పిల్లొతికె ఎగ్రుకుంట దూక్కుంట చేత్తం" అంటున్న బుడ్డోడి బుగ్గల్ని ముద్దు బెట్టుకుంట గట్లుండార్రా! పిల్లలైనా,పెద్దలైనా అన్న అవ్వ మాటల్కి సంబురపడ్కుంట గట్లనే అవ్వా! అన్నారిద్దరు.
గదండీ సంగతి! ఏపని సక్రంగ సెయ్యకుండ పొద్దులు పుచ్చేటోళ్ళను, వాయిదాలు ఏశేటోళ్ళకు గీ అగ్గో అంటే ఆరునెల్లు- ఇగ్గో అంటే మూడు నెల్లు"సామెత అత్కినట్టు సరిపోద్ది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి