పటియాలా రాజా! :- అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజుల్లో గొప్ప వారు రాజులు మహారాజులు మాత్రమే మద్యం సేవించారు.వింత అలవాట్ల పటియాల మహారాజు భూపిందర్ సింహ్ విచిత్ర వ్యక్తి.తెగ తాగేవాడు.స్కాట్ విస్కీలో పాలు కల్పి గుటకలేసేవాడు.విలాసాలకులాసాల సోంబేరి భోగి అతడు.బ్రిటిష్ పత్రిక దిలండన్ మిర్రర్ 12మార్చి1938లో అతను చనిపోయాక లైఫ్ స్టైల్ పై ఓవ్యాసం రాసింది.తెల్లార్తూనే ఆమహానుభావుడు ఒక పింట్ ఆఫ్ స్కాచ్ విస్కీలోపాలుకల్పి తానూ తాగుతూ ఇతర్లచేత తాగించేవాడు.లివర్ పాడవదు అని డబ్బా కొట్టేవాడు.మామూలు పెగ్ కన్నారెండురెట్లు ఎక్కించేవాడట!ఆరోజుల్లో యూరప్ లోరమ్, బ్రాంది పాలు మసాలా కల్పికొట్టి బొజ్జ నిండా పట్టించి పిప్పళ్ల బస్తాలా తయారైనారు రాజులు.తనరోల్స్ రాయల్ కారును గుర్రంలాగా జోరుగా దౌడుతీయించేవాడట మ్యూజిక్ వింటూ విదేశీ ఆడాళ్లతో డాన్స్ చేసేవాడు!1911లో తండ్రితో కల్సి లండన్ వెళ్లి రాత్రి ఊటుగాతాగి కారిడారు నంతా నీటితో తడిపేశాడు. కార్పెట్ పాడైతే హోటల్ వాళ్లు అగ్గిమీదగుగ్గిలం ఐనారు.తండ్రి నష్టపరిహారం చెల్లించి కావాలంటే హోటల్ కూడా కొనేస్తాను అని హామీ ఇచ్చాడుట!! ఒక రైలుబోగీనంతా స్కాచ్ విస్కీ షాంపైన్ తో నింపి తనతో తెచ్చుకున్న మహా తాగుబోతు.పారిస్ నైట్ క్లబ్ లో ఊటుగా ఎక్కించి భాంగ్డా డాన్స్ చేసి జనాల్ని వెర్రెత్తించాడు.ఇక తనదగ్గరకు వచ్చిన ఫ్రెండ్స్ కి వెర్రి షరతుల ఛాలెంజ్ విసిరేవాడు."ఆఏనుగు ముందు కాళ్లమధ్యలోంచి నడు" అని పురమాయించేవాడు. విదేశీయులముందు తెగ తాగుతూ వారిచేత బలవంతాన తాగించేవాడు.వారు నిషా తలకెక్కి బొక్కబోర్లాపడినా మనవాడు ఇంకా పీపాపొట్టలోకి ఎక్కించేవాడు.రాజులు బూజుపట్టిపోయినా, మరి నేడు మనం ఏంచేస్తున్నాం? గల్లీ గల్లీ లో మద్యంతో బీదాబిక్కీ గొప్ప వారు తాగుడుతో పీకలమీదకితెస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు,రేవ్ పార్టీలతో జనం భరిస్తున్నారు.కొత్త సంవత్సర సంబరాలు అర్ధరాత్రి దాటినా తాగుడు తందనాలు! నేడు బడిపిల్లలు మాదకద్రవ్యాలకి,పెద్దలు గొప్పోళ్లు గోవాకి వెల్తారు .పట్టించుకోని అమ్మ నాన్నలు,అలాగే పిల్లలు🌹
కామెంట్‌లు