కొత్తూరు రచయితల వేదిక ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులను కొరవే పురస్కారాలతో సత్కరించామని వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు తెలిపారు. స్థానిక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల ఆవరణలో కొత్తూరు రచయితల వేదిక తొమ్మిదో నెల సమావేశంలో ఈ పురస్కార ప్రదానం గావించినట్లు ఆయన తెలిపారు. తొలుత వేదిక సహకార్యదర్శి గడసాపు ఉషారాణి స్వాగతవచనములు పలుకగా, ఉపాధ్యక్షులు ముదిల శంకరరావు ప్రార్ధనా గీతాన్ని ఆలపించగా కార్యక్రమం ప్రారంభమైంది. వేదిక ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరి జ్యోతి ప్రజ్వలన గావించారు. వేదిక సభ్యులు గేదెల మన్మధరావు మాట్లాడుతూ వచ్చే నెల మూడవ తేదీ నుంచి గుంటూరులో మూడు రోజుల పాటు జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఈ కొరవే పురస్కారాలను అందజేయుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యా కమిటీ ఛైర్మన్ లోతుగడ్డ లక్ష్మీ నారాయణ నాయుడు తాతబాబు మాట్లాడుతూ సాహిత్యమనేది సమాజంలో నైతిక విలువలకు కట్టుబడి ఉంటుందని, తరతరాల సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకై పరితపిస్తుందని అన్నారు. కొత్తూరు రచయితల వేదిక సభ్యులు ఆ దిశగా కృషి చేయుట మిక్కిలి అభినందనీయమని అన్నారు. అనంతరం వివిధ రంగాల్లో చిత్తశుద్ధితో కృషి చేస్తున్న పలువురు ప్రముఖులను కొరవే పురస్కారాలతో ఘనంగా సన్మానించారు. ఆద్యాత్మిక రంగంలో పెద్దిన కులశేఖర ఆల్వార్, సేవారంగంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత రామరాజు ట్రస్ట్ అధ్యక్షులు పారశెల్లి రామరాజు, పౌరాణిక రంగంలో వైశ్యరాజు వెంకటరాజు గుప్తా, కళారంగంలో పేడాడ గురుమూర్తి, జానపద రంగంలో బలగ హరిప్రసాదరావు, విద్యా రంగంలో సల్ల మన్మధరావు, వైద్య రంగంలో ఇప్పిలి జానకిరామయ్య, సామాజిక సేవారంగంలో పొగిరి రవి లను శాలువా, జ్ఞాపిక, సన్మానపత్రం, నగదు పారితోషికాలతో కొరవే పురస్కారాలను ప్రదానం చేస్తూ వేదిక సభ్యులు ఘనంగా సన్మానించారు. సభ్యులు ఎవిఆర్ఎం దిలీప్ రాజా పట్నాయక్ రచించిన సన్మానపత్రాలను వినిపించి బహూకరించారు. అనంతరం వేదిక సభ్యులు పల్ల నారాయణరావు సమన్వయంతో కవిసమ్మేళనం జరిగింది. వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు, ఉపాధ్యక్షులు ముదిల శంకరరావు, ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరి, సహకార్యదర్శి గడసాపు ఉషారాణి, సభ్యులు ఎవిఆర్ఎం దిలీప్ రాజా పట్నాయక్, గేదెల మన్మధరావు, పి.నారాయణరావు, బాణాన రమణమూర్తి తదితరులు కవితలు వినిపించి సభాసదుల ప్రశంసలు పొందారు.
ఘనంగా కొరవే పురస్కారాల ప్రదానోత్సవం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి