చిరుతపులి, పరుగుపందెం... :- - యామిజాల జగదీశ్
 ఒకసారి ఓ నిర్వాహకుల బృందం వేగంగా పరుగెత్తే కుక్కలకు, గంభీరమైన చిరుత మధ్య ఒక గొప్ప పెరుగు పందెం పోటీని ఏర్పాటు చేసింది. ఎవరు వేగంగా పరిగెడతారో చూడటానికి ఆసక్తిగా జనం గుమిగూడారు.
కానీ పోటీ ప్రారంభమైనప్పుడు, చిరుత కదలలేదు. అది ప్రశాంతంగా కూర్చుంది. చుట్టూ చూస్తోంది. అది కదలకపోవడంతో ప్రజలు అదేమిటీ చిరుత పెరుగు వేగం చూద్దామనుకుంటే అది అసలు కదలలేదేమిటి చెప్మా అని గుసగుసలాడుకున్నారు. “అలసిపోయిందా? భయపడిందా? లేదా చివరిక్షణంలో పరిగెత్తినా గెలుపు తనదే అనే ధీమాలో ఉందా?” ఇలా రకరకాలుగా అనుకున్నారు.
అయితే సమన్వయకర్త విషయం గ్రహించి ఓ నవ్వు నవ్వి
“చిరుత తనను తాను నిరూపించుకోవడానికి పరిగెత్తదు... అది వేటకు బయలు దేరింది ఉంటే అందులో ఓ ఉద్దేశం ఉంటుంది. అంతే తప్ప తానెంత వేగంగా పరిగెడుతున్నానో అనేది నలుగురికీ తెలియాలనుకోదు....” అని అంటూ ఇంకా ఇలా అన్నాడు......
“కొన్నిసార్లు, మీరు ఉత్తములని నిరూపించుకోవడానికి ప్రయత్నించడం, మీ ప్రతిభ ఆ క్షణంలో కాలం కలిసిరాక మీకు మీరే అవమానపడటం....ఏ మాత్రం సరికాదు. కనుక ప్రతి పోటీలో చేరాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే నిజమైన, ముఖ్యమైన దాని కోసం మీ శక్తిని ఆదా చేసుకోండి" అని అన్నాడు.
ఈ మాటలు విన్న ప్రేక్షకులు మౌనంగా విన్నారు. ఎందుకంటే దాని విలువ తెలిసిన జీవి జ్ఞానాన్ని వారు ఇప్పుడే చూశారు.
మీరు మీ బలాన్ని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.  నిజమైన శక్తి ప్రశాంతంగా ఉంటుంది. ఉద్దేశపూర్వకంగానూ ఉంటుంది. అర్హమైనదని భావించినప్పుడే శక్తిని ప్రదర్శించాలి. అంతే తప్ప ప్రతి క్షణమూ పోటీపడాలనేం లేదు. 

కామెంట్‌లు