***
"అవ్వా! గీ సంగతి తెల్సా? సోమిదమ్మత్తకి పచ్చవాతమొచ్చి మంచాన బడింది గద.అత్తకి చేయడం ఒక్కని వొల్లగాక ,కొడుకు కోడల్ని పట్నం నుంచి పిల్పించిండు."
గది నాకు సుత తెల్సు శెల్లె! ఇంగ మావ కట్టాలు గట్టెక్కినట్టె.పాపం! ముస్లాయన ఎంత బుగులు బడ్డడో! లేకుంటెనా బిడ్డ బోయి డిల్లీల ఉండె.అయినా ఆడవిల్ల ఎన్నాళ్ళుంటది?ఇంగ నయం కొడుకు పట్నంల ఉండబట్టి సర్పోయింది. ఇద్దరూ గదేదో కంపిన్ల జేత్తున్నరంట గద. ఇంట్లె నుంచి సుత గా ఉజ్జోగం చెయ్యొచ్చంట. గట్ల ఆళ్ళు రాడం మావ పానానికి ఆయిగుండొచ్చు కదే శెల్లె!
"ఓ అవ్వా! ఇంకెక్కడి ఆయి. గాళ్ళు రానప్పుడె మంచిగుండు. గిప్పుడు మావని జూసినవో లేదో పాతికేండ్లు పైబడిన పండు ముస్లోని లెక్కుండు. గాల్లొచ్చిండ్రని సూన్నీకి బొయినా! తిండి తింటుండో లేడో! బక్కగ శెక్కపేడొతికె అయ్యిండు. ఏంది మావా? అంటే మాట దాటేశిండు."
"అవునా శెల్లె! నేను ఎల్లత్త గా సంగతేందో తెల్సుకుంట"
"నువ్వొచ్చిందంక గీ ఇస్రాయి మీద పెసలు ఇస్రుకుంట."అన్కుంట సాపేసుకుని దోతి గుడ్డ బరిసి దాన్మీదకి ఇస్రాయి డొల్పుకొచ్చి సక్కంగ సర్జేసి పెసలు ఇస్రుకుంట కూసుంది.
**
గంటైనంక వొచ్చిన అవ్వని ఏందవ్వా? గట్లున్నవ్? ఏమైందని గుచ్చి గుచ్చి అడ్గుతున్న నర్సమ్మను ఆపి "ఏం జెప్పుడు శెల్లె!. గాళ్ళు బిడ్డలు గాదు శెల్లె! జల్గలు. బరిగె జెనిగెలు. ఎంట బడి పీడిచ్చే పిశాచులు.
" ఏందవ్వా!గంత మాట అనబడ్తివి! అస్లేమయిందో శెప్పు".
"ఏముంది శెల్లె! వొచ్చిన కానించి గా కొడ్కు,ఆత్తి తన పేర్న రాయమని మావని కూసోనిచ్చుడు లేదంట నిల్వడ నిచ్చుడు లేదంట. గిదంత ఎప్పటికైన నీకే గదరా! అంటే ససేం ఒప్పుకోలేదంట".
యింగ గాడి పోరు తట్కోలేక ఆడి పేర్న ఆత్తి రాయడాన్కి ఒప్పుకుండంట.అయితే మల్ల మెలిక బెట్టిండంట.ఆత్తంత పెళ్ళాం పేర్న రాయమని పట్టుబట్టిండంట. రాత్తే గీత్తే నీకు రాత్త గని దానికెట్ల రాత్త అన్నడంట".
గట్ల కొడ్కేమో ఆత్తి కోసం లొల్లి చేత్తుంటే, గదంత మతిల బెట్కొని ఇంగ కోడలేమో సద్దెన్నంల సల్ల సుక్కేసి ఇచ్చుడు.పాశి అన్నం బెట్టి తింటె తిను లేకుంటే లేదని తలెగరేసుడు చెయ్యబట్టిందంట".
గింతకీ మావ ఆత్తైతే రాయలేదు గద!"
"మావ ఉట్టి పిచ్చిమొకపోడు. గా ఆత్తి రాశిత్తెనన్న కొడ్కు మంచిగ సూస్కుంటడేమో అన్కొని ఆత్తంత కొడుక్కి రాసిచ్చిండంట.
గట్ల రాశిచ్చినా మావ శెరలు దప్పలే. గాళ్ళు అత్తను జూస్కునుడు లేదు.మావకు కడ్పునిండ తిండి బెట్టుడు లేదు. గిదేందని నిలదీత్తే శెప్పకుండ శెయ్యకుండ రేత్రికి రేత్రే ఎల్లిపోయిండ్రంట. ఇంగ మావ దుఃఖం దుఃఖం గాదుపో శిన్న పోరనొతికె ఏడ్వ బట్టిండు. గా మావని సూత్తుంటే మన్సు కలికలి అయింది శెల్లె!
"అడ్డాల నాడు బిడ్డలు గని గడ్డాలనాడు బిడ్డలా?" గీ రోజుల్ల కొందరికి అమ్మ అయ్య వొద్దుగని గాళ్ళు సంపాయించిన ఆత్తులు, నగలు మాత్తరం కావాలె. ఏం మణుసులో ఏమో? పాపం పండిపోతుంది శెల్లె!"
"గింతకీ గా మావ బత్కెట్ల అవ్వా!"
" ఇంగ నయ్యం గీళ్ళ తెల్వకుండ పించెను డబ్బులు బేంకుల ఏసి దాశిండట గవ్వున్నయని జెప్పిండు. గవ్వే లేకుంటే గాళ్ళ ఆళ్ళకింక దోశిత్తుల గాచారం అయ్యేది. గా పైసల్తో బత్కమని జెప్పిన.అత్తకి ఒంట్లో ఓపిక లేదు గద.ఇంట్లో పని చెయ్యనీకి,అత్తకి చెయ్యనీకి మడిషిని సూశి పెడ్త అన్న.అన్నం కూరొండి తీస్కపోవాలె! రా శెల్లె! గియ్యాల మనిద్దరం అత్తకి తానం బోసొద్దాం" అన్నం తినిపిద్దాం. అవ్వ మాటల్కి 'సరే' అని తలూపింది నర్సవ్వ.
గదండీ సంగతి."ఆస్తులు గావాలి గని అమ్మ నాయిన వొద్దు. గట్లాంటోళ్ళని జూసే గీ సామెత పుట్టుకొచ్చింది."అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలా?"కాలం మారింది.బయం బత్తి లెవ్వు,మంచి మరియాద లేదు, శివరాకరికి గీ లోకం ఏమైతదో?"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి