ఆహారం ఆహారమే కానీ ఔషధం కాదు కదా!!?:- డా ప్రతాప్ కౌటిళ్యా.
 ఆహారం అంటే శరీరానికి శక్తినిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆకలిని తీర్చే పదార్థాలను ఆహారం అంటాం. ఆహారం రెండు రకాలు శాఖాహారం మాంసాహారం. రెండింటిలో ఉండే పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వులు శరీరానికి అవసరమయ్యే శక్తిని ఇస్తాయి అంతేకాక అవసరమయ్యే విటమిన్లు లవణాలు హార్మోన్లు ఎంజైములకు తోడ్పడతాయి. పూర్వము మనుషులు మొదట ఆకులు అలములు మాంసంపై ఆధారపడ్డారు. ఆ తర్వాత వ్యవసాయం నేర్చుకున్న తర్వాత ధాన్యాలు పప్పు ధాన్యాలు నూనె ధాన్యాలు పండ్లు ఆకుకూరలు గింజల పై ఆధారపడ్డారు. అంతేకాకుండా పాలు నెయ్యి మొదలగునవి ఆహారంగా స్వీకరించారు. 
రాను రాను స్థానికతను బట్టి స్థానిక నేలలను శీతోష్ణస్థితిలను బట్టి పండే పంటలను పండ్లను కూరగాయలను వ్యవసాయం ద్వారా పొందడం మొదలెట్టారు. స్థానికంగా అందుబాటులో ఉండే వాటినే ఆహారంగా స్వీకరించారు. ఈ రకంగా పంటలపై ఆధారపడి ఆహారపు అలవాట్లు వారి జీవనశైలి ఏర్పడ్డది. క్రమక్రమంగా స్థానికతను బట్టి ఆహారం తీసుకునే విధానాలు పద్ధతులు ఏర్పడ్డాయి. ఏది ఏమైనా ఆహారం నుంచే ఆరోగ్యం ఆధారపడ్డ రోజునవి. అంతేకానీ ఆరోగ్యం కోసం ఆహారాన్నే ఔషధంగా మార్చుకునే వాళ్ళు కాదు వాళ్లు. ఆహారం ఆహారమే ఔషధం ఔషధమే అని భావించేవాళ్లు. కనుక ఆహారం ద్వారా శక్తిని ఆరోగ్యాన్ని పొందిన రోజులవీ
కాలానుగుణంగా శీతోష్ణస్థితిలో నేలలు మార్పుకు గురై పంటలు మారడం వలన ఆహారం నిర్వచనం పూర్తిగా మారిపోయింది. దానికి ప్రజల ఆర్థిక స్థితిగతులు సరిగా లేకపోవడం వలన జనాభా పెరుగుదల కారణంగా కుటుంబ భారం పెరగడం వలన సంతుల ఆహార పదార్థాలు అందుబాటులో లేకుండా పోయాయి అంతేకానీ ఆహారం మాత్రం అందుబాటులోనే ఉంది. ఇప్పటికీ స్థానిక శీతోష్ణస్థితులు నేలలు బట్టి పంటలు పాడి పాలు కూరగాయలు పండ్లు మాంసము అందుబాటులోనే ఉన్నాయి. ఒక క్రమమైన ఆహారపు జీవనశైలి ఏర్పడింది. అందుకోసం ఆహారపు అలవాట్లు పద్ధతులు విధానాలు మార్చుకోవాల్సి రావడం ఒకరకంగా శ్రేయస్కరం  కాదేమో. మన కావాల్సింది ఆరోగ్యం శరీరానికి శక్తి మాత్రమే కనుక మన కావాల్సింది ఆహారం కానీ ఔషధం కాదు కదా. చాలా సందర్భాల్లో వైద్యులు నిపుణులు సంతుల ఆహారం అంటే స్థానిక ఆహారం అని అర్థం. కానీ ఔషధ రూపంలో ఆహారాన్ని మార్చుకొని తినాల్సిన అవసరం లేదని గమనించాలి. మన కావాల్సింది ఆహారం కానీ ఔషధం కాదు కదా.!!?
డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు