సుప్రభాత కవిత : - బృంద
ఒకటే మనసు లో 
ఎన్నో భావాలు 
ఒకటే జీవితంలో 
ఎన్నో ఎత్తుపల్లాలు 

ఒకరికి చేదైనది 
మరొకరికి మంచి 
కొందరికి బరువైనది 
ఎందరికో తేలిక

మోహం ఒకవైపు 
మోసం మరోవైపు 
శోకం ఒకవైపు 
విలాసం ఒకవైపు 

ఇన్ని తాకిళ్ళు తగిలి
తగలడే బ్రతుకులు
తపించే మనసులు
పడిలేచే ప్రయత్నాలు

తడిలేని కళ్ళు లేవు 
తడిసిపోని దిళ్ళు లేవు
తగవులేని మాట లేదు 
తలపులకు హద్దులు లేవు

ఓర్పు లేని మార్పులు 
సర్దుకోలేని  అహాలు 
దిద్దుకోలేని తప్పులు 
వద్దనుకునే బంధాలు

చిన్నవైన హృదయాలు 
ఎనలేని చిక్కుముళ్ళు 
ఎదురీతగా మారిన 
ఎలమి లేని జీవితాలు

తీరు మారిన జీవితాల్లో 
కోరుకునే ఆనందాలు 
ఏరుకునే అవకాశం ఇచ్చే 
ఎదురులేని వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు