కలలలోని తిమిరాలను
కరిగించే మెరుపులా...
కనులలోని నీలి నీడలు
కనుమరుగయే తీరున......
వెలువడక ఆగిపోయిన
విలువైన రహస్యంలా.....
వెల్లడైన అద్భుతమై
వెతలు తీర్చే తీరున....
నిశీధి నిరుత్సాహానికి నేర్పిన
నిశ్శబ్ద పాఠంలా...
నిర్ణయాల దారిలో కష్టాలు
నిలువరించే తీరున....
కళ్ల అంచున ఉన్న భయాన్ని
కత్తిలా మార్చుకునే ధైర్యంలా...
కలవరపు తెరలు తొలగించి
కదనానికి కదిలే తీరున...
చావో రేవో పోరాటం తప్పదని
చలించక అడుగువేసేలా...
చదవని పాఠాల పరీక్షకు
చక్కగా బయలుదేరదీసే తీరున...
తెల్లని వెలుగులు పంచుతూ
తెలియని ధైర్యం నింపుతూ
తెలివెలుగులతో స్వాగతించు
తెలవారిన వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి