ప్రేమంటే:- కవి మిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.-(పుష్యమి)-విశాఖ పట్నం
బాల్యంలో అమ్మ అన్నం తిననని నే మారాం చేస్తే
ఓపిక లేకపోయినా ప్రేమతో ఎత్తుకు
డాబామీద చంద్రుని చూపిస్తు
చందమామ రావే అని పాడి పాలబువ్వ తినిపించినది.

వివాహమై కన్నతల్లితండ్రులను వదలి నాతో వచ్చి
కష్ట సుఖాలలో కలిమిలేములలో తోడునీడగా ఉండి
ప్రేమానురాగాలతో మీకు నేనున్నానన్న  కంటికి రెప్పలా కాపాడిన ధర్మపత్ని.

వృద్దాప్యంలో నే జన్మనిచ్చి పెంచి  పెద్ద చేసిన
నా తనయ నాన్న చిన్నప్పుడు వేలుపట్టుకు నడిపించావు
భయపడకని ప్రేమతో నన్నుకూడా పిల్లలతో సమానంగా చూసే తనయ
ఎన్నని చెప్పను ఏమని చెప్పను
ప్రేమన్నది యువతీ యువకుల మధ్య ఆకర్షణ కాదు
స్వచ్ఛమైన ప్రేమ అమృతం కన్నా మధురం..!!
............................

..............................

కామెంట్‌లు