వ్యక్తిత్వం: - కోలా సత్యనారాయణ - విశాఖపట్నం

 వ్యక్తిత్వం అంటే ఒక వ్యక్తి తత్వం!
వ్యక్తి నడతతో అతని స్వభావం తెలుస్తుంది! 
మనసులో మాట ఒకటైతే, 
పైకి మాత్రం బుద్ధిగా కనిపిస్తారు! 
ఆపదలో ఆదుకునే వారు కొందరైతే, 
ఇతరులు బలహీనతను తనకు... 
అనుకూలంగా మార్చుకునేది కొందరు! 
ఎందరో ఈ సమాజంలో ఇలా, 
గోడమీద పిల్లిలా మెలిగే వారు!
నోరారా పలకరించి, ఆనక... 
కళ్ళతో వెక్కిరించే వారెందరో! 
కర్ణుడు మంచివాడైనా...
రారాజు తో కూడి చెడ్డాడు!
ముఖం చూడగానే చెప్పొచ్చు... 
ఎదుటివాడు ఎలాంటివాడో! 
మిన్ను విరిగి మీద పడ్డా, తన..
అసలు స్వభావం మార్చుకోని వాడే... 
అసలైన ఉత్తమ వ్యక్తి అవుతాడు! 
స్వార్థం ఎంతున్నా, కొంచెం పరమార్ధం ఉంటే,
కపటం మాని,ఎప్పుడూ కలుపుగోలుగా ఉంటే,
పరోపకారమే తన ఆశయం అనుకుంటే,
ఎదుటివారిని ఆనందంగా ఉంచకున్నా,
బాధ పెట్టకూడదు అనుకుంటే, 
పదిమంది నిన్ను మెచ్చకున్నా...
ఈసడించుకో రాదనుకుంటే, 
నీ నడవడికను మార్చుకో! 
ఉత్తమ వ్యక్తిత్వం అలవర్చుకో!!
కామెంట్‌లు