నోరు మంచిదైతే ఊరుమంచిదౌతుంది.మాట్లాడటం ఓకళ. నొప్పించక తానొవ్వక సూటిగా స్పష్టంగా మాట్లాడాలి. "నీపని అయ్యేదాకా అలా మాట్లాడు,మనం అడిగితేనే పని జరుగు" అన్నాడు గౌతమబుద్ధుడు.సొంత డబ్బా కాక నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి.బడిలో టీచర్లు చెప్పే పాఠం ఒకటే కానీ పిల్లల జవాబులు వేర్వేరు.ఒక టాపిక్ పై బాగా అవగాహన, సబ్జెక్టు తెల్సి ఉండాలి.మరీ స్పీడ్ గా లొడలొడ వాగితే మనభాష భావం అర్ధం కాదు.అలాగని జీడిబంకలా గంటకో వాక్యం విసుగొస్తుంది.అక్షరాలు బాగా ఉచ్చరించాలి. పదాలు పలకాలి. విధ్యాలయాలు శుద్ధతప్పు.అక్కరలేని వాటికి వత్తులు పెట్టడం ఘోరం.కామాలు ఫుల్ స్టాప్స్ చూసుకుంటూ చదవాలి.ముఖం పైకెత్తి ఎదుటివారి కళ్లలోకి సూటిగా చూస్తూ జవాబివ్వాలి.టీచర్ల దగ్గర భయపడకుండా తెలీక పోతే రాదు తెలీదు అని చెప్పటం ఉత్తమం. చిన్న పిల్లల్ని ప్రేమగా పెద్దల్ని గౌరవంతో పలకరించితే అందరి గుండెలో నిల్చిపోతాం🌹
మాట చూపు మంచి బాట!:-అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి