సాహిత్య హోలీ- విత్తనాల విజయకుమా కుమార్-హైదరాబాద్.
సాహితీ కవి కళాపీఠం 
సాహితీ కెరటాలు

తేదీ:  25/12/25

అంశం:    సాహితీ కవి కళాపీఠం 
సాహితీ కెరటాలు
=============
మేలును చేకూర్చి ఉన్నతంగా తీర్చిదిద్దేది సాహిత్యం.
గిరిజనుల సంస్కృతిలో ప్రధాన భాగమైన
జానపదసాహిత్యం.
గ్రామ గ్రామానా జనులను అలరించిన దేశిసాహిత్యం.
కళాకారులను పుట్టించి ఉత్సాహపరిచిన పదసాహిత్యం.

సాహిత్య సారం ప్రజల మనసులపై ఆలోచనలను వెదజల్లు.
జ్ఞానాన్ని కలుగచేసి ప్రగతి పథం వైపు తీసుకెళ్ళు. 
ఆటపాటలతో పనులను చేసుకొనే వారి ఎదలపై తొలకరిజల్లు.
న్యాయం కోసం ఉద్యమ స్ఫూర్తికి నిప్పులువెదజల్లు.

కవనాలూ కథలూ నవలను పద్య గద్య పాటల రూపంలో ...
రచయితలూ, రచయిత్రులూ  సాగుచేసి విజ్ఞానాన్ని పండిస్తే,
ఎందరో కళాకారులు సాహిత్యాన్ని ఆశ్రయించి అలరిస్తుంటే,
చదివే పాఠకులూ చూచే ప్రేక్షకులు పరవశిస్తున్నారు.

మన భాషనూ సంస్కృతినీ సుసంపన్నం చేస్తున్న వర్షం.
మానవ జీవితాలను ఉన్నతీకరించే పుష్పవర్షం. 
వాల్మీకి మొదలు ఎందరో కురిపించిన మేలు చేసే అక్షరాల కుంభవర్షం.
సాహిత్య జల్లులాటకు ప్రపంచానికే తల మానికం భరతవర్షం.
సాహిత్య వేత్తలు సృష్టిస్తున్న నవరసాల  జల్లులను చల్లుతూ ...
జనులు అలసటలను మరిచేందుకు  కనువిందు చేస్తుంది సాహిత్యపు హోలీ.


•••••••••••••~•

కామెంట్‌లు