సంక్రాంతి: - బట్టల సాన్వి -ఆరవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -బక్రిచెప్యాల జిల్లా సిద్దిపేట

 సంక్రాంతి పండుగ వచ్చింది 
సంబరాలను తెచ్చింది. 
దుకాణానికి వెళ్లాను. 
గాలిపటాన్ని కొన్నాను
దానికి తోకను పెట్టాను
మధ్యలో దారం కట్టాను 
బిల్డింగ్ పైకి ఎక్కాను
గాలిలో ఎగుర వేశాను. 
పైకి ఎగిరి పోయింది. 
ఆకాశానికి అంటింది.
నాకు సంబుర మయ్యింది. 
గాలి పటం గాలిపటం. 
గాలిలో ఎగిరే గాలిపటం. 
పక్కనున్న పిల్లవాడు
మాంజా దారం కట్టిండు.
నా గాలిపటం పై వదిలాడు
గాలి పటమంతా చినిగింది 
బోరు బోరున ఏడ్చాను 
మళ్ళీఒక్కటి కొన్నాను
మంచిగ ఎగురవేశాను.

కామెంట్‌లు