మా మంచి మామయ్య:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-హైదరాబాద్.
 అమ్మ నాన్నలంటే తెలియని నన్ను
ఆప్యాయతతో పెంచి
అనురాగాన్ని పంచి
ఆటపాటలతో బాటు
అడిగిన  చదువు చెప్పించి
అందంతో బాటు చదువు సంస్కారం గల
ఆదిత్య బావతో వివాహాం జరిపించి
అత్తయ్య ఏమన్నా
అమ్మలు మనకు కోడలు కాదు కూతురే
అన్న మా మంచి మామయ్య
అందనిలోకాలకు  వెళ్ళాడని తెలిసి
ఆర్ద్రతతో మనస్సు భారమైంది.....!!
...........................

కామెంట్‌లు