మనకోసమే!!:- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
మనం 
సూర్యుని కిందికి దించాల్సిన అవసరం లేదు 
మనం 
చంద్రుని కిందికి దించాల్సిన అవసరం లేదు 
మనం 
ఆకాశాన్ని కిందికి దించాల్సిన అవసరం లేదు. 
మనం 
ఎక్కడున్నా వాళ్ళం అక్కడే ఉన్న 
అవి మన దగ్గరే ఉన్నాయి 
అవి మన కోసమే పని చేస్తున్నాయి.!!

మేఘం మనకోసమే పుట్టింది. నది మన కోసమే పుట్టింది 
సముద్రం మనకోసమే పుట్టింది. 
చెట్టు మనకోసమే పుట్టింది. అడవి మన కోసమే పుట్టింది 
పంట మన కోసమే పుట్టింది. 
పక్షి మనకోసమే పుట్టింది చేప మనకోసమే పుట్టింది 
మట్టి మనకోసమే పుట్టింది మైదానం మనకోసమే పుట్టింది. 
మనం 
ఎక్కడున్నా వాళ్ళం అక్కడే ఉన్నా 
అవి మన దగ్గరే ఉన్నాయి మనకోసమే పని చేస్తున్నాయి. 

మనం 
సృష్టిని మళ్లీ సృష్టించాల్సిన అవసరం లేదు 
దాని పని అది చేసుకుంటూ మనకోసమే పని చేస్తుంది. 

ఎండాకాలం వానాకాలం చలికాలం దేనికోసం 
మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు 
మనం 
ఎక్కడున్నా వాళ్ళం అక్కడే ఉన్న 
అవి మన దగ్గరే ఉన్నాయి మన కోసమే పని చేస్తున్నావీ

పగలు రాత్రి ఉదయ సందెలు దేనికోసం 
మనం దిగులు పడాల్సిన అవసరం లేదు 
అవి మన దగ్గరే ఉన్నాయి 
అవి మన కోసమే ఉదయిస్తున్నాయి అస్తమిస్తున్నాయి 
అవి మన కోసమే పని చేస్తున్నాయి. 

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు