పిల్లల్లారా రారండి
నల్లబల్లను చూడండి
నల్లగ నుండును నిజమండి
సుద్దముక్కను పట్టండి
అక్షరాలను రాయండి
అక్షరాలు కుదురకుంటే
డస్టరు పట్టి మలపండి.
అక్షరాలతో అజ్ఞానం
వెడలును నిత్యము చదువుచు ఉంటే "
నల్లబల్ల లాంటి మనసులు
తెల్లబడును,రాయుచుండగ
నల్లబల్ల లేంది పాఠము
ముందుకు జరుగదు బాలలు
దేవాలయంలో దేవుడున్నట్లు
తరగతి గదిలో
నల్లబల్లుండును.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి