కావ్యం ఓ పద మంజరి :- ఓగిరాల గాయత్రి విజయవాడ
సాహితీ కవి కళాపీఠం,
సాహితీ కెరటాలు,
=================
మనోహరమగు అర్ధమగు కావ్యము అలంకృతమైన పద సముదాయం.!

శబ్దార్థములుతో కూడిన కావ్యము,
రమణీయార్థమును ప్రతిపాదించు శబ్దము కావ్యము.!

అరిషడ్వర్గాల పందిరి మీద క్షణానికో పూవు పూచే చిత్ర గంధి, 
స్పందన లేని ప్రశ్నలకు వివరణ కై 
సందేహాల బోనులో నిలబడ్డ సాక్షి లాంటిది కావ్యము.!

కళ్ళులేని కాలం, చెవులు లేని కలంతో,
నోరులేని కాగితం మీద కన్నీటి అక్షరాలతో 
వ్రాసుకుపోతున్న.. కావ్యం.!

రసమయ ఘడియల్లో సృజించిన కవిత,
ప్రకృతి ని తెలిపే కావ్యంగాన,
ఆకృతిని మరిపించే సాలభంజిక,
బాధ్యత ను గుర్తించే భవ్యమంజరి,
యుగాల్లో జ్వలించే దివ్యప్రజ్వలిత.!

కలం నుంచి నూతన అక్షర మాలికలు 
జల జలమని ఏకధాటిగా అహోరాత్రులూ,
రాలుతూనే ఉంటే, ఆవేదనలు  ఆనందాలుగా మారాయి.!

భావపాదం పరుగులు తీస్తుంటే
ఆవేశపు విధ్యుత్తు అక్షర విరులను ఎగజిమ్ముతోంది.!
కాగితం దాని క్షేత్రమై, కావ్యం దాని గోత్రం అవుతోంది.!

కావ్యం లాంటి  జీవితంలో కరిగి పోయేకాలానికి, 
చెరిగిపోయే రాతలకు మిగిలిపోయే  తీయనిజ్ఞాపకం లేనప్పుడు,
అది కుదురు లేని కావ్యమే అవుతుంది.!

కామెంట్‌లు