చిత్ర స్పందన : - .. కోరాడ నరసింహా రావు!
 గొల్లింతుల ఇంట,ఉట్టిలోని వెన్న,మీగడలు 
   జట్టుగాళ్లతో కలిసి దొంగిలించ... 
    వారంత కూడి తల్లి యసోదతో తగవులాడ... 
   నీ ఆకతాయి పనులకు కోపగించి... 
  అమ్మ యాసోద నిను కొట్టగా...పరుగు లిడుతూ
   చిక్కెడివాడవా... ఓ చక్కనివాడా...కృష్ణా...! 
 చిక్కితివా ఆనాడు దుష్ఠ చతుష్టయమునకైన...! 


   
  అతి సులువుగ చిక్కితివి గద, కుచేలునకు పాండవులేకున్...!! 
  భక్తికి, ప్రేమకును అతి సుల భుడ వయ్య నీవు... 
   నీవుగాక నాకు  దిక్కెవ్వరు దేవ దేవ... 
   పాహి పాహి  రక్ష రక్ష పరమాత్మా ... శ్రీ కృష్ణా...! 
     *****

కామెంట్‌లు