పాలఖండ్యాంలో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు
 అనేక గణితాంశాలకు సూత్రధారి రామానుజన్ అని పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి అన్నారు.
జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆర్.ఎల్.కుమారి మాట్లాడుతూ అనేక గణిత అంశాలపై పరిశోధనలు చేసిన రామానుజన్ నేటికీ గణిత శాస్త్రవేత్తలకు స్పూర్తిగా నిలిచారని అన్నారు. 
ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన శనగల సురేష్, యామిని, భాను, అమృత,  విజయలలిత, పూజ, తేజేశ్వరరావులకు బహుమతులను అందజేశారు. వక్తృత్వ పోటీల్లో డొప్ప నాగేంద్ర, వేదవాసిని, రాజు, చాందిని, రోహిత్, దేవా, హరీష్, వ్యాసరచన పోటీల్లో కొర్నాన సునీత, సునంద, హారిక, కావ్య, ఉమాలక్ష్మి, సాయివర్ధన్, రోహిణి, గణిత చతుర్విధ ప్రక్రియల పోటీల్లో సయ్యద్ జుబేర్, సంపత్, సుధీర్, నిఖిల్, దేవా, ఢిల్లీశ్వర్, భాను, గణితాంశాల సామగ్రి ప్రదర్శన పోటీల్లో బత్తుల లిఖిత, రాజేశ్వరి, హేమ, తేజేశ్వరి, నవ్య, సాహిత, మంజుల, లావణ్యలకు బహుమతులను అందజేశారు.
గణిత ఉపాధ్యాయని ఆర్.ఎల్.కుమారికి సన్మానం:-
 

 అనంతరం పాఠశాలలో గణిత ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న ఆర్.ఎల్.కుమారిని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, పిల్లల దాలమ్మలతో పాటు, విద్యార్థులు బత్తుల లిఖిత తదితరులు శాలువాలు, కానుకలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు