నా 82 ఏళ్ళ జీవితంలో చూశాను. ఎన్నో వింతలు. నాకప్పుడు 15 సంవత్సరాలు. మా అన్నకు తీవ్రమైన కీళ్ల వ్యాధి వచ్చి చేతులు,కాళ్ళు కదిలించలేకపోయాడు.ఒకరకంగా చెప్పాలంటే వేలు కూడా కదిలించలేకపోయాడుఅప్పటికి అల్లోపతి అంటే ప్రజల్లో భయమేగాని నమ్మకం అసలు లేదు. పిల్లలకు టీకా వేస్తామని వచ్చిన డాక్టర్లను చూచి పల్లెటూర్లలో పిల్లలు దాచిపెట్టేసేవారు.
అటువంటి పరిస్థితిలో మా ఆన్న స్నేహితుడు ఆయుర్వేదం డాక్టర్, ఉండేవారు.ఆయన వచ్చి మా ఆన్నను పరిశీలించి" ఇది చాలా తీవ్రంగా ఉంది నేను చెప్పినట్లు చే స్తే తప్పకుండా తగ్గుతుంది" అని చెప్పి ఈక్రింది విధంగా చేశాడు.నేల మీద చాపపరిచి తల కింద దిండు కూడా లేదు దాని మీదే ఆయన్ని మనుషులు తీసుకొచ్చి పడుకోబెట్టారు. తర్వాత ఆయనఆహారం, ఉప్పు చింతపండు కారము నూనె ఏది లేకుండా కొన్నిరకాల కూరలు మాత్రమే ఉడికించి పెట్టాలి రెండవది మునగకాయ చారు. కొద్ది నిమ్మకాయ ఉప్పు కలిపి ఇది ఆయన భోజనం ఆ విధంగా రెండు నెలలు పూర్తి అయ్యేసరికి ఆయన లేచి చక్కగా తిరిగారు ఆయుర్వేదం మందుతో.
అలాగే మరో కేసు. మా ఊరి మునసుబు గారికి ఓ విచిత్రమైన వ్యాధి వచ్చింది. ఒళ్లంతా మంటలు బట్టలు కూడా వేసుకోవడానికి వీలు లేని పరిస్థితి. మంటలకు తట్టుకోలేక తొట్లో నీళ్లు పోసుకుని దాంట్లో కూర్చునేవారు. అటువంటివారిని తన మందుతో తిరిగి మళ్ళీ మామూలు మనిషిని చేసిన ఘనత ఆయుర్వేదానిది, ఆయుర్వేద డాక్టర్ ది.ఇటువంటివే ఇంటి వైద్యాలు కూడా. అవి,ఆయుర్వేద వైద్యాలు ఆనాడు అద్భుతంగా పనిచేసేవి. కాకపోతే మన వారి మూర్ఖత్వం ఇంటి వైద్యాలు, ఆ మందులను మరెవరికి చెప్పకూడదని
కొన్ని ఇంటి వైద్యాలను వారితోనే పోవడం జరిగింది. ఇలాంటివి నా జీవితంలో కళ్ళారా చూశాను.ఆనాటి వైద్యం ఆహారంతో,దినచర్యతో ముడిపడి ఉండేది. మందుతో పాటు అనుపానమని ఇచ్చేవారు. ఉదాహరణకు ఒక మందుకు తేనె అనుపానం. తేనెతోనే అది తీసుకోవాలి. భావన జీలకర్ర, మొదలైన చిన్న ఔషధాలు ఇళ్లలోనే తయారు చేసుకునే వాళ్ళం. ఐతే ఆయుర్వేదం ఆయుర్వేదం క్రమశిక్షణతో గట్టిపత్యంతో కూడుకున్నది. అది ఈనాటికి కొంచెం కష్టమైన పనే. "లంఖణం పరమౌ షధం"కడుపు ఖాళీగా పెట్టుకోవడం కూడా మందుతో సమానం అని ఆయుర్వేద సూత్రం.
***

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి