రంగ, సోము ఒకే తరగతి చదువుతున్నారు. ఇద్దరూ చదువు పక్కన పెట్టి, రోజూ గంటల తరబడి ఆటలు ఆడి, ఇంటికి వెళ్లేవారు. సెలవు రోజుల్లో అసలు ఇంటిపట్టున ఉంటే ఒట్టు. ఇద్దరూ 8వ తరగతికి వచ్చారు. 7వ తరగతి వార్షిక పరీక్షలలొ రంగ మార్కులు చూశాక తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. తమ పనుల్లో తాము మునిగి, పిల్లవాని చదువు పట్టించుకోనందుకు తమను తామే నిందించుకున్నారు.
ఒకరోజు పొరుగునే ఉన్న వాసు అనే అబ్బాయి తన తల్లిదండ్రులతో ఒక ముఖ్యమైన పని మీద రంగవాళ్ల ఇంటికి వచ్చాడు. మాటల సందర్భంలో వాసు కూడా 7వ తరగతి పూర్తి చేసుకున్నాడని అతడు చదువుతున్న పాఠశాలలో ఉపాధ్యాయులు మంచి బోధన అందించడంతో పాటు విద్యార్థుల క్రమశిక్షణకు పెద్ద పీట వేస్తారని తెలిసింది. రంగ తల్లిదండ్రులు రంగను కూడా వాసు చదువుతున్న పాఠశాలలో వేశారు. రంగ ఇప్పుడు చదువులో పడ్డాడు. బుద్ధిమంతుడైనాడు.
కాలం గడుస్తున్నది. సోము ఇప్పుడు 9వ తరగతిలోకి వస్తున్నాడు. సోము చదువులో చాలా వెనుకబడి ఉన్నాడని తల్లిదండ్రులు ఆలస్యంగా తెలుసుకున్నారు. గత సంవత్సరం సోము మిత్రుడైన రంగ మంచి పాఠశాలలో చేరి మంచి విద్యార్థి అయినాడని సోము తల్లిదండ్రులకు తెలిసింది. వారు తమ కొడుకుని తీసుకుని ఆ మంచి పాఠశాలకు చేరినారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విషయం అడిగాడు. సోమును చాలా చిరాకుగా చూసి, "వీడినా? మా పాఠశాలలో ససేమిరా చేర్చుకోలేము." అని అన్నాడు. తల్లిదండ్రులు షాకయ్యారు. కారణం అడిగారు. "వీడు గత సంవత్సరం ఎవరినీ అడగకుండా మా ఇంటి గోడ దూకి మా డాబా పైకి ఎక్కాడు. మీ వాడు ఎగరేస్తున్న గాలిపటం తెగి మా డాబా మీద పడిందట. కనీసం ఎవరి అనుమతి లేకుండా దొంగతనంగా మా ఇంట్లోకి రావడం తప్పు కదా! అలా ఎందుకు వచ్చావని అడిగినండుకు మాతో చాలా పొగరుగా మాట్లాడినాడు. ఒక చదువుకునే విద్యార్థి ప్రవర్తన ఇలా ఉంటుందా? కోపంగా వెళ్ళగొడితే అనరాని మాటలు అనుకుంటూ వెళ్ళాడు. ఛీ! వీడిని చేర్చుకుంటే మా పాఠశాలలో మిగిలిన విద్యార్థులు చెడిపోతారు." అన్నాడు ప్రధానోపాధ్యాయులు. తల్లిదండ్రులు షాకయ్యారు. తమ అతి గారాబం వల్లనే వీడు ఇలా తయారయ్యాడని అర్థం అయింది. లబోదిబోమన్నారు. ఎంత బతిమాలినా ప్రయోజనం శూన్యం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి