కవి కలమే హలమైతే…?:- కవి రత్న -సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్లపల్లి-\అత్తాపూర్ హైదరాబాద్.
కవి కలమే... 
హలమైతే..?
కవి…మట్టిగుండెల్లో 
మొలకెత్తే మొక్కౌతాడు
రెక్కలు కట్టుకొని 
చుక్కలలోకంలో విహరిస్తాడు..!

కవి కలమే.. 
త్రిశూలమైతే...
కవి… త్రినేత్రుడై 
అంధుల, కామాంధుల 
గుండెల్లో త్రిశూలం గుచ్చి 
గుణపాఠాలు నేర్పే గురువౌవుతాడు..!

కవి కలమే... 
గాలమైతే..?
కవి…అధికార మదంతో 
అతిస్వేచ్ఛగా తిరిగే అవినీతి 
తిమింగలాలకు వేటగాడౌతాడు..! 

కవి కలమే... 
వజ్రాయుధమైతే..?
కవి…అణచివేతల 
పంజాలలో చిక్కుకున్న
అమాయకపు బడుగు జీవుల 
ప్రాణాలకు రక్షణ కవచమౌతాడు..!

కవి కలమే... 
అణుబాంబైతే..? 
కవి…అగ్నిజ్వాలల్ని పుట్టిస్తాడు...
మనిషిలోని కాఠిన్యాన్ని మసిచేసి 
కుళ్ళిపోయిన ఈ సమాజాన్ని 
పునీత జలధారలతో శుద్దిచేస్తాడు
అంబేద్కర్ ఆశించిన నవసమాజ 
నిర్మాణానికి పునాదిరాయి ఔతాడు..! 


కామెంట్‌లు