సామెత -77: -అత్త పెట్టే ఆరళ్ళే అగపడ్తయి గని కోడలు చేసే కొంటెతనం అగపడదు
***
"అవ్వా!నేనా ఇంట్ల నెగల్లేను.ఇంగ నా వల్ల గాదు.'నింద లేందే బొంది పోదన్నట్టుంది' నా బత్కు. గిది గిట్ల గది గట్లని ఏజ్జెప్పినా 'ఓ నాకు సుత తెల్సు తియ్యి' అన్కుంట మూతి మూడొంకర్లు తిప్పి _గంజిలీగను దీసినట్టు' తీసెత్తుంది.
మొన్నట్కి మొన్న జాలాట్లె బోళ్ళు దోమి సబ్బిల్ల తున్కలు తున్కలు జేసి గట్లనే వొదిలిందవ్వా! గా తున్కల మీద కాలుబడి జర్రున జార బోయిన.''గదేందే గట్లెందుకు జేసినవ్? జర్రైతె కాలిర్గు గద. గా సబ్బు తున్కలు ఓకాడ పిస్కిపెడ్తె మల్ల పన్కొచ్చేదని కూసింత లాషిగన్ననని "
"మీ యమ్మ గంతలావు మాటంటదాని" కొడుక్కి జెప్పి లొల్లి బెట్టింది.గిందుల నాదేమన్న తప్పుందా అవ్వా? నువ్వే జెప్పు.
"బువ్వ, కూరొండుద్ది.అడుగున ఇంకో మడిషి తినేంత గట్లనే వదిలేత్తది.గట్లాగం జేసుకోవద్దే,ఎంత కట్టపడ్తెనో గవి మన కంచాలకొచ్చే దంటే"... "మా కాందానంతే గిట్ల అడుగు,బొడుగు గీక్కోని తినమని" దెప్పి పొడుత్తది."
"గివ్వన్ని ఎవలికి శెప్పుకోనవ్వా! నాలి నాలిగ గజ్జేసే పన్లెవ్వలికి అగపడవు. నేనన్న మాటలే ఇనబడ్తయవ్వా!" వొక్క తీర్గ సొద ఎల్లబోస్కుంటున్న ఎల్లమ్మని ఊకుండ బెడ్తూ...
గందుకే అంటరు శెల్లే! "అత్త బెట్టిన ఆరళ్ళే అగపడ్తయి గని కోడలు జేసే కొంటెతనం అగపడదు అని."
మా బాగా జెప్పినవ్ అవ్వా! సత్తెం బల్కినవ్. గీ కాలపోల్లకి అత్తొద్దు,మావొద్దు.గాళ్ళు జెప్పే సుద్దులు బుద్దులు అస్లే వద్దు.పతి దాన్కి తప్పులు బట్టుడు.ఈకలు పీకలు దీసి లొల్లి బెట్టుడు.మన కాలంల గిట్లన్నాం కుక్కిన పేను లెక్క నోరెత్తకుండ పడున్నం."
"కాలం మారిందే శెల్లె. మనమూ మారాలి. గిప్పుడు మనమట్ల పడుంటేనే బతుకు పశాంతంగ ఉంటది. నువ్వేం రంది బడకు.లేనిపోని రోగాలు కొనితెచ్చుకోకు". అని సమజయ్యేలా జెప్పి పంపింది అవ్వ.
గదండీ సంగతి " అత్త బెట్టిన ఆరళ్ళే అగపడ్తయి గని కోడలు జేసిన కొంటెతనం అగపడదు" అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి