శ్రీపురం రాజ్యాన్ని ధనంజయుడు పరిపాలిస్తూ ఉండేవాడు. విజయయాత్రలు చేస్తూ ఆయా రాజ్యాలను తన రాజ్యంలో విలీనం చేసుకుంటూ పరిపాలన సాగించేవాడు. అతని కాలంలో శత్రువులు కన్నెత్తి కూడా ఆ రాజ్యం వైపు చూడలేకపోయేవారు. ధనంజయుడు వయసు పైబడుతున్నందున తన కుమారుడు విజయునికి పరిపాలన బాధ్యతలు అప్పజెబుతాడు.
ధనంజయుని చేతిలో ఓడిపోయి తమ రాజ్యాలను కోల్పోయిన రాజులలో మోహనుడు ఒకడు. విజయుడు రాజైన తర్వాత మోహనుడు శ్రీపురం మీదికి దండయాత్ర చేసి, ఆ రాజ్యాన్ని ఆక్రమించాలని అనుకున్నాడు. కానీ అతని శ్రేయోభిలాషి అయిన రంగన్న "తొందరపాటు వద్దు. కొత్త రాజు పరాక్రమం గురించి మనకు తెలియదు కదా! కొంత కాలం ఆగుదాం. కొత్త రాజు గురించి పూర్తిగా తెలిశాక ఆలోచిద్దాం." అన్నాడు.
సంవత్సరం గడిచింది. మోహనుడు మారు వేషంలో శ్రీపురం రాజ్యానికి వెళ్ళాడు. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఎక్కడ చూసినా పచ్చదనమే. అడుగడుగునా చెట్లూ దట్టమైన అడవులే కనిపించాయి. విజయుడు విజయయాత్రల మీద దృష్టి పెట్టకుండా వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలు కరువున పడకుండా చేస్తున్నాడని తెలుసుకున్నాడు మోహనుడు. ఆశ్చర్యపోయాడు. విజయుని ఆలోచన అద్భుతమనిపించింది. దండయాత్ర ఆలోచన పక్కన పెట్టి, విజయుని మిత్రునిగా చేసుకోవాలని అనుకున్నాడు మోహనుడు.
విజయ విజయం : - సరికొండ శ్రీనివాసరాజు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి