స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రపతి పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావును ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం కళాశాల గ్రౌండ్ లో పార్వతీపురం మన్యం పుస్తక మహోత్సవం జరుగుతుండగా, హాజరైన తిరుమలరావును స్వాగతిస్తూ ఈ సన్మానం గావించారు. కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్న పులఖండం చక్రధర శర్మ తిరుమలరావు సేవలను కొనియాడుతూ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చక్రధర శర్మ మాట్లాడుతూ 1982-84 లో ఈ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యాభ్యాసం గావించిన తమ పూర్వ విద్యార్ధి తిరుమలరావు, అనతికాలంలోనే 2009లో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత స్థాయిని సాధించి, తమ కళాశాలకు ఎంతో గర్వకారణంగా నిలిచారని అన్నారు. 1989లో శ్రీకాకుళం జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా ప్రభుత్వ ఉద్యోగ నియామకం పొందిన తిరుమలరావు, తన గుణాత్మకమైన బోధనలతో విద్యార్ధుల చదువుల స్థాయిని పెంపొందిస్తూయున్నారు. చిత్తశుద్ధితో కృషి చేస్తూ. బాలబాలికల్లో చదువుల స్థాయిని పెంపొదిస్తున్నారు. ఒక సామాజిక బాధ్యతతో సాహిత్య సాంస్కృతిక కళా సేవా రంగాలలో కూడా శ్రమిస్తూ, విద్యాశాఖకు వన్నె తెచ్చిన తిరుమలరావు, 2009లో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా స్వీకరించారు. ఈ కళాశాలలో రెండు సంవత్సరాలు చదువుకున్న పూర్వ విద్యార్థి కుదమ తిరుమలరావును తెలుగు ఉపన్యాసకులు పులఖండం చక్రధర శర్మ, టి.రవి ప్రసాద్, ఎన్.ధూళికేశ్వరరావు, గొట్టాపు కృష్ణమూర్తి తదితరులు సన్మానించి ప్రసంగించారు. తిరుమలరావు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. పార్వతీపురానికి పొరుగునున్న జియ్యమ్మవలస మండలం కుదమ గ్రామస్థులైన తిరుమలరావు, 1972-77 ప్రాథమిక విద్య కుదమలోను, 1977-82 ఉన్నత పాఠశాల విద్య తోటపల్లిలోను, ఈ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ ని పూర్తి చేసుకున్నారు. స్థానిక బెలగాం చర్చివీధిలో ఒక అద్దెగదిలో అద్దెకు ఉంటూ ఈ కళాశాల విద్యను పూర్తి చేసినట్లు తిరుమలరావు తెలిపారు. తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆనాటి పరిస్థితులను వివరించారు.
కేంద్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత తిరుమలరావుకు సన్మానం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి