మెస్సీ–సీఎం రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్…:- -ఎస్.వి.రమణా చారి,సీనియర్ జర్నలిస్ట్

 ఇందులో కిక్(రహస్యం) ఏంటి?మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్ అన్న వార్త వింటే ఇది క్రీడా ఈవెంటా, రాజకీయ బ్రాండింగ్ షోనా అన్న సందేహం రావడం సహజం. ప్రపంచ ఫుట్‌బాల్ ఐకాన్‌ను రాష్ట్ర సీఎంతో జత చేయడం వెనుక కేవలం ఆట పట్ల ప్రేమ మాత్రమే ఉంటే ప్రశంసనీయం. కానీ ఇక్కడి “రహస్యం” ఇమేజ్ పాలిటిక్స్‌లోనే దాగుంది. యువత ఆకర్షణ, గ్లోబల్ విజిబిలిటీ, రాష్ట్రానికి అంతర్జాతీయ మార్కెటింగ్ ఈ మూడు గోల్స్ ఒకేసారి కొట్టాలనే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రశ్న మాత్రం ఒకటే: మెస్సీ మైదానంలో గోల్ చేస్తే, ప్రజా సమస్యల మైదానంలో ఎవరు స్కోర్ చేస్తారు? ఫ్లడ్‌లైట్స్ కింద సెలబ్రిటీ కిక్‌లు కాదు, వెలుగు అవసరమైనవి గ్రామాల సమస్యలు, ఉపాధి, విద్య, వైద్యం. ఆట ద్వారా ఆశ ప్రేరేపించడంలో తప్పులేదు.కానీ ఆ ఆశను విధానాల్లోకి మార్చగలిగితేనే ఈ మ్యాచ్ నిజంగా విజయం. లేకపోతే ఇది రాజకీయ పెనాల్టీ షూటౌట్‌లో మరో పీఆర్ గోల్ మాత్రమే.

కామెంట్‌లు