సుప్రభాత కవిత : - బృంద
కాలికింద ఇసుక 
కాలంలా జారిపోతుంటే 
తూర్పు చూస్తూ వేసే అడుగులో 
మార్పు కోసం  నిరీక్షణ!

సముద్ర గర్భం నుండి 
వెలువడినట్టు తోచి
తడి తగలక  తరలివచ్చే 
తరగని వెలుగుల గని!

ఎదుగుతున్న క్రమంలో 
ఎరిగించే పాఠాలను 
ఎరుక గలిగి ఎదను నింపి 
ఎదురులేక సాగిపోమ్మనే దీవన!

అలల అలజడికి 
కలలు చెదిరిపోగలవని 
కలతలు కమ్మితే కలవరపడక
బలంగా నిలవాలని హెచ్చరికలు!

బాసటగా ఎవరూ రారు 
ఊరటగా  మాటైనా దొరకదు 
చేరువగా నిలువని స్నేహం 
ఒంటరిని చేసే తరుణం...

నీ నీడే నీకు తోడుగా 
ఆ నింగే నీ గొడుగుగా 
నీ ఓర్పే నీకు రక్షగా...
నీ ధైర్యమే నీ సైన్యంగా.....

ఆగక సాగే పయనానికి 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు