వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి చేరినాడు వాసు. టీవీలతో కాలక్షేపం లేదు. సెల్ ఫోన్ల ఆటలే లేవు. ఆ ఇంటికి సమీపంలో ఉన్న మిత్రుడు రాము ఇంటికి వెళ్లడం కరవు తీరా ఆడుకొని రావడం వాసు దినచర్య. వాసు వాళ్ల అమ్మమ్మ ఇంటికి రాము కూడా వచ్చేవాడు. ఇద్దరూ కలసి ఆడుకోవడం, ముచ్చట్లు చెప్పుకోవడం, మాట్లాడుకుంటూ ఊరంతా తిరిగి రావడం వీరి దినచర్య. ఇద్దరికీ బోలెడంత కాలక్షేపం.
వాసు రాము వాళ్ల ఇంటికి వెళ్లినపుడి వీళ్ళిద్దరూ కలసి ఎక్కువగా ఆడే ఆట క్యారం బోర్డ్. సమయం తెలువకుండా గంటల తరబడి ఆడుతుంటారు. వీరిద్దరిలో ఎవరిది పైచేయో చూద్దామని మహేంద్ర అక్కడ కూర్చుని ఆట చూస్తున్నాడు. పూర్తిగా వన్ సైడ్ మ్యాచ్. రామూనే ఎక్కువ గెలుస్తున్నాడు. ఎక్కువసార్లు వాసు ఓడిపోతున్నాడు. అయినా రాము ముఖంలో గర్వం కనబడలేదు. వాసు ముఖంలో విచారం, దిగులు కనబడలేదు. ఇద్దరూ ఎంతో సంతోషంగా ఆటను కొనసాగిస్తున్నారు. మహేంద్ర ఆశ్చర్యపోయాడు.
ఆ తర్వాత మహేంద్ర వాసును కలసి "వరుసగా నువ్వే ఓడిపోతున్నావు. అలాంటి పరిస్థితుల్లో ఆ రాముతో క్యారమ్స్ ఆడటం అవసరమా?" అని అడిగాడు. "మేము ఇద్దరమూ ప్రాణ మిత్రులం. ఇద్దరికీ బోలెడంత కాలక్షేపం కావాలి. గెలుపు ఓటములను ఎవరూ పట్టించుకోము." అన్నాడు వాసు. ఆ తర్వాత రోజు మహేంద్ర రామును కలసి, "ఆ వాసూకు క్యారమ్స్ అసలే రాదు. అలాంటి వాడితో ఆడటం నీకు టైంవేస్ట్. పైగా నీకు వచ్చిన ఆట పోతుంది. వాణ్ణి పక్కన పెట్టి, నాతో ఆడవచ్చు కదా!" అన్నాడు. "మేమిద్దరం ప్రాణ స్నేహితులం. మాకు గెలుపు ఓటములతో సంబంధం లేదు. మాకు కాలక్షేపం, ఆటలు ముఖ్యం." అన్నాడు రాము. మహేంద్ర వారి స్నేహబంధాన్ని అభినందించాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి